నటీనటులు: రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడిటింగ్: బొంతల నాగేశ్వరరావు


సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్.బాల్ రెడ్డి


సంగీతం: కళ్యాణ్ నాయక్


నిర్మాత: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య  


రచన,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య


సినీ ఇండస్ట్రీలో విలన్స్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోలుగా మారిన సందర్భాలున్నాయి. ఈ కోవలో సీనియర్ నటుడు రావు రమేశ్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. మరి ఈ సినిమాతో రావు రమేశ్ హీరోగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..


సుబ్రహ్మణ్యం (రావు రమేష్ ) మారుతీ నగర్ నివాసి. అతనికి చిన్నప్పటి నుంచి ఎలాగో అలా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలేనేది అతని లక్ష్యం. అది సంపాదించే లోపు పెళ్లైపోతుంది. అతని భార్య కళా రాణి(ఇంద్రజ)కు ఎలాగో ప్రభుత్వ ఉద్యోగం వస్తోంది. దీంతో భార్య విధేయుడిగా ఉంటూ ఆమెకు లొంగి పాతికేళ్లుగా బతికేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చినా.. కొంత మంది కోర్టు కెళ్లడంతో అపాయింట్ మెంట్ రాదు. దీంతో భార్య సంపాదనమీద బతికేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతినికో అబ్బాయి అర్జున్ (అంకిత్) కలల్లో తేలిపోయే రకం. అతనో అల్లు అరవింద్ కుమారుడు అనే టైపులో బతికేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రమణ్యం అకౌంట్ లో రూ. 10 లక్షలు పడతాయి. అది ఎవరు వేసారో తెలియక తికమక పడతారు. ఇంట్లో అవసరాల కారణంగా ఆ డబ్బును సుబ్రహ్మణ్యం ఖర్చు పెట్టేస్తాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అకౌంట్ లో రూ. 10 లక్షలు ఎవరు వేసారు ? చివరకు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యానికీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అనేదే మిగతా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు లక్ష్మణ్ కార్య.. మిడిల్ క్లాస్ నుంచి లో క్లాస్ ఎవరికైనా.. గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం సెటిలైపోయినట్టే అని భావిస్తుంటారు. ఈ సున్నితమైన పాయింట్ చుట్టు చక్కగా కథను అల్లుకున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 25 యేళ్లు ఎదురు చూడటం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు. అంతేకాదు గవర్నమెంట్ జాబ్ వచ్చినా.. కోర్టు కేసు కారణంగా అపాయంట్ మెంట్ పెండింగ్ లో పడటం అనేది ఎంతో మంది విషయంలో జరిగిందే. అంతేకాదు అనుకోకుండా ఓ కామన్ మ్యాన్ వ్యక్తి అకౌంట్ లో రూ. 10 లక్షలు పడితే.. అతను ఎలా ఫీల్ అవుతాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాడు. అంతేకాదు ఓ కామన్ మ్యాన్ గా రావు రమేష్ నుంచి మంచి నటనే రాబట్టుకున్నాడు. అంతేకాదు కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాల్సిన ఎంతో మంది తీవ్ర వేదనకు గురవుతుంటారు. వారి బాధలను సుబ్రహ్మణ్యం పాత్రలో చూపించాడు. ఆ పాత్రకు రావు రమేష్ తప్పించి మరొకరు ఊహించుకోనంత రేంజ్ లో నటించి మెప్పించడం విశేషం.


మధ్యలో ఎమోషన్స్ చూపించినా.. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ చేయడంలో కాస్త తడపడ్డట్టు కనపించాడు. సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అకౌంట్ లో డబ్బులు పడినా.. దాన్ని ఖర్చు చేయాలా వద్దా అనే కామన్ మ్యాన్ పాత్రలో రావు రమేష్ నటన హిల్లేరియస్ గా ఉంటుంది. మధ్యలో రావు రమేష్ కుమారుడి లవ్ ట్రాక్ ఉన్నా.. అందులో ఫన్నీ యాంగిల్ ఉండటంతో ప్రేక్షకులకు బోర్ అనిపించదు. ఓవరాల్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేసి చివరకు ఎమోషనల్ టచ్ తో ముగించాడు దర్శకుడు. ఎడిటర్ సెకండాఫ్ లో లవ్ ట్రాక్ ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ఆకట్టుకుంటాయి.


నటీనటుల విషయానికొస్తే..
రావు రమేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఎమోషనల్ పాత్రను ఎంతో ఈజ్ తో మెప్పించాడు. ఆయన హావ భావాలు, డైలాగులతో ఆకట్టుకున్నాడు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం భార్య పాత్రలో ఒదిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూస్తూ ఎలాంటి సంపాదన లేని మొగుడును తిట్టిపోసే పాత్రలో జీవించింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.


ప్లస్ పాయింట్స్


కథ


రావు రమేష్ నటన


క్లైమాక్స్ ట్విస్ట్


మైనస్ పాయింట్స్


సెకండాఫ్


ఎడిటింగ్


పంచ్ లైన్.. నవ్వంచే ఎమోషనల్ డ్రామా ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’


రేటింగ్ : 3/5


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి