Raviteja's  BYD Atto 3 EV Features: ఈ మధ్యకాలంలో అందరూ ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేసి వాడేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు ఎక్కువగా ఈ కారులు కొని వాటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో సెలబ్రిటీలు సైతం  ఈ ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ కొనుగోలు చేశారు.  చైనా కు సంబంధించిన బివైడి అనే ఒక సంస్థ ఆటో 3 అనే ఒక కారుని ఈ మధ్యనే మార్కెట్లో రిలీజ్ చేసింది. 5 సీట్ల కెపాసిటీ కలిగిన ఈ కారు విలువ 34 లక్షల నుంచి మొదలవుతుంది .ఒకసారి ఫుల్లుగా చార్జింగ్ పెడితే 521 కిలోమీటర్ల పాటు ఈ కారులో ప్రయాణించవచ్చట. ఈ కారు రెండు వేరియంట్లలో వస్తుంది, బేసిక్ ఎలక్ట్రిక్ మోడల్ 34 లక్షలు కాగా స్పెషల్ ఎడిషన్ మాత్రం 34 న్నర లక్షల వరకు రేటు పలుకుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Virupaksha Request: విరూపాక్షకి హిట్ టాక్.. ఆ విషయం బయట పెట్టొద్దంటూ వేడుకోలు.. మెగా స్టార్ ప్రసంసలు వైరల్!


మన ఇండియా మార్కెట్ లో ఈ కారు కొత్తదే కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ కారు కొనుగోళ్లు ఎక్కువగానే ఉన్నాయి. చూడడానికి చిన్న కారు లాగా కనిపిస్తూ ఉండడంతో ఈ కారుని రవితేజ కొనడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరైతే ఫ్యామిలీ కోసం కొనుగోలు చేసి ఉండవచ్చేమో అని కామెంట్లు చేస్తున్నారు.  నిజానికి ఈ కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఈ మధ్యనే పూర్తయింది. స్వయంగా రవితేజ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు విచ్చేసి ఈ కారుకు సంబంధించి 17608 రూపాయలు ఖర్చుపెట్టి టీఎస్ 09 జీబీ 2628 నెంబర్ దక్కించుకున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి సైతం ఒక లగ్జరీ కారు కొనుగోలు చేసి ఇదే ఖైరతాబాద్ ఆర్టీవోలో కారుని రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు రవితేజ కూడా రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరూ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 
Also Read: Naveen Yerneni hospitalised: వరుస ఐటీ రైడ్స్.. మైత్రీ నవీన్ కు అస్వస్థత..హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook