రాజకీయాలు..సినిమాలు. ఈ రెండు రంగాల్లో ఎక్కువగా కన్పించేది వారసత్వమే. సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. 70 శాతం వారసులే కన్పిస్తారు. అయితే తన కొడుకు ఎంట్రీ మాత్రం అప్పుడే కాదని స్పష్టం చేశాడు మాస్ మహారాజా రవితేజ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు చలనచిత్ర ( Tollywood ) పరిశ్రమలో వారసత్వానికి కొదవ లేదు. సినీ నేపధ్యం లేకుండా స్టార్‌డమ్ సంపాదించుకున్నవాళ్లు చాలా తక్కువ. అగ్రనటుల్లో దాదాపు అందరిదీ వారసత్వ నేపధ్యమే. నటన ఉండవచ్చు గానీ ఎంట్రీ ఇచ్చింది మాత్రం వారసత్వ నేపధ్యంతోనే. ఎటువంటి వారసత్వ నేపధ్యం లేకుండా స్టార్‌డమ్ సంపాదించినవారిలో ఒకప్పుడు చిరంజీవి ( Chiranjeevi )...తరువాత మాస్ మహారాజా రవితేజ ( Mass maharaja Raviteja ) పేర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ కూడా అదే కోవలో వస్తారు. 


చిరంజీవి వారసులు ఇప్పటికే సినీ ప్రవేశంలో చేసి స్థిరపడ్డారు.విజయ్ దేవరకొండ సైతం తన తమ్ముడు ఆనంద్‌ను పరిచయం చేశాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ( Middle class melodies ) ‌‌తో హిట్ కూడా కొట్టాడు. మరి రవితేజ సంగతేంటి. ఇవాళ కాకపోతే రేపైనా సరే వారసుడిని పరిచయం చేయడం తప్పేలా లేదు. రాజా ది గ్రేట్‌ ( Raja the great )లో రవితేజ తనయుడు చిన్నప్పటి రవితేజగా నటించాడు. తరువాత చాలా ఆపర్లు వచ్చినా..రవితేజ ( Raviteja ) వద్దంటున్నాడు. కొడుకును అప్పుడే సినిమాలకు పరిమితం చేయడం ఇష్టం లేదంటున్నాడు. ఆ సమయం ఇప్పుడు కాదని...తరువాతేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న కొడుకు మహాధన్‌కు మరో ధ్యాస లేదని మాస్ మహారాజా అంటున్నాడు.


అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) బలవంతం చేస్తేనే రాజా ది గ్రేట్‌లో ఒప్పుకున్నానని..ఇకపై కాదని చెప్పేశాడు రవితేజ. సినిమాలు చేయమని కూడా తన కొడుకుని బలవంతం చేయనని..ఏదిష్టమైతే అదే చేస్తాడనేది మాస్ మహారాజా రవితేజ చెబుతున్న మాట.


Also read: ట్రెడిషనల్ లుక్‌లో కంగనా రనౌత్ ఎలా ఉందో చూడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook