Khiladi Third Single: మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ' నుంచి మూడో సింగిల్ విడుదలైంది. 'అట్టా సూడకే' సాంగ్ లిరికల్ వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. 'అట్టా సూడకే.. మత్తెక్కుతాంది ఈడుకే... ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సాంగ్‌లో హీరో రవితేజ, హీరోయిన్ మీనాక్షి చౌదరి కలిసి ఆడి పాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఖిలాడీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్‌ సాంగ్‌, 'ఇష్టం' సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. గతంలో రవితేజతో 'వీర' సినిమా తెరకెక్కించిన రమేష్ వర్మ ఖిలాడీకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రస్తుతం రవితేజ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఖిలాడీతో పాటు ధమాకా, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో రామారావు ఆన్ డ్యూటీ (Raviteja Ramarao on Duty) విడుదల తేదీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది మార్చి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఖిలాడీ సినిమా రిలీజ్‌కు, రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు కేవలం 45 రోజుల గ్యాప్ మాత్రమే ఉండటం గమనార్హం.


Also Read: Liger Glimpse : లైగర్‌ గ్లింప్స్ వచ్చేసింది.. రౌడీ చింపేశాడు.. ఛాయ్‌వాలా ఫైటర్‌‌గా దుమ్మురేపాడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook