Meena: రెండో పెళ్లి గురించి మీనా.. నా కూతురు భవిష్యత్తు ఏమిటి అంటూ వ్యాఖ్యలు
Meena Second Marriage: మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించి హీరోయిన్స్ లో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సూపర్ హిట్లు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా మీనా తన రెండో పెళ్లి గురించి స్పందించిన విషయం వైరల్ అవుతోంది..
Meena Dhanush:
90లో మీనా సౌత్ ఇండియాలో ప్రత్యేక స్థానం ఉండేది. ఆమె నటించని సూపర్ స్టార్ లేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది. చైల్డ్ క్యారెక్టర్ గా సినీ రంగంలోకి ప్రవేశం చేసిన మీనా ఈమధ్య కూడా వెంకటేష్ తో దృశ్యం చిత్రం చేసి ప్రశంసలు అందుకుంది. కాగా మీనా హీరోయిన్ గా ఉన్నప్పుడు రూమర్స్ కి చాలా దూరంగా ఉండేది. సినీ ఇండస్ట్రీ అంటే ఏవో కొన్ని తప్పులు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మీనాపైన అలాంటి రూమర్స్ చాలా తక్కువగా వచ్చాయి.
కానీ ఈ మధ్య మాత్రం మీనా భర్త చనిపోయాక ఆమె రెండో పెళ్లి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మీనా తమిళ హీరో ధనుష్ ని పెళ్లి చేసుకుంటుంది అని వచ్చిన వార్త అందరిని షాక్ కి గురి రిచేసింది. దానికి తోడు ధనుష్ కూడా రజినీకాంత్ కూతురు.. తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇవ్వడం ఈ రూమర్ కి మరింత అర్జం పోసింది. దీంతో ఈ ప్రచారానికి హద్దు అదుపు లేకుండా పోయింది. దీంతో మనస్థాపానికి గురైన మీనా ఆఖరికి విషయం గురించి స్పందించింది.
ఈ విషయం గురించి మీనా మాట్లాడుతూ ‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా దిగజారిపోతోంది. వాస్తవాలు తెలుసుకొని రాస్తే అందరికీ మంచిది. నాలా ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. నా పేరెంట్స్.. కుమార్తె భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి రెండవ పెళ్లి ఆలోచన లేదు. వస్తే నేను స్వయంగా వెల్లడిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ధనుష్ పేరు ఎట్టి మరి మీనా ఈ విషయం గురించి చర్చించింది.
‘నాకు, హీరో ధనుష్ కు లింక్ చేశారు. నేను ధనుష్ ని రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ఎంతో మంది వార్తలు రాశారు. అతనితోనే కాదు ఎంతోమందితో నా పేరు జత చేసి వార్తలు రాశారు. అవన్నీ చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా రాసేవారు ఆలోచించట్లేదు.. ఒకానొక సమయంలో వారిపై నాకు చాలా కోపం వచ్చింది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం కలగలేదు. నా వరకు ప్రస్తుతం మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని కూడా కచ్చితంగా చెప్పలేను. ఏం జరుగుతుందో చూడాలి” అంటూ క్లారిటీ ఇచ్చింది.
Also Read: మందుబాబులకు వెరీ బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు, పబ్‌లు బంద్
Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి