Actor Nagababu Shocking Comments: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ''తెలుగు సినిమాలను ఆంధ్రాలో బ్యాన్ చేయండి. మాకేం నష్టం లేదు. కొన్ని రోజులు ఇబ్బందిపడినా యూట్యూబ్, ఓటీటీ, డిజిటల్ మాధ్యమాల ద్వారా మాకు డబ్బులు వస్తాయి. ఆంధ్రాలో హాలీవుడ్ సినిమాలను రూ.10కి చూపించగలరా? అని ప్రశ్నించారు. చిరంజీవి గారు సీఎంతో మాట్లాడినా ఎందుకు జీవో ఇవ్వలేదని నిలదీశారు. మా ఆర్థిక మూలాలను కొట్టాలని చూస్తున్నారు. అలా జరగదు. జరగనివ్వం'' అంటూ నాగబాబు హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్‌కు మద్దతివ్వకపోవడం దురదృష్టకరం:
ఇటీవల ఏపీ ప్రభుత్వ (Ap Government) తీరుపై నటుడు నాగబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan) ప్రభుత్వం టార్గెట్‌ చేసిందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా టికెట్‌ ధరలపై ఏపీ సర్కార్‌ ఇప్పటికీ ఎందుకు జీవో విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పవన్ పై పగతో ఇలా చేస్తున్నా..సినిమా పెద్దలు ఎవరూ నోరు మెదపకపోవడం దురదృష్టకరమని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉండేది ఐదేళ్లే అనే విషయాన్ని వైకాపా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు. 


Also Read: Bigg Boss: సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి.. తమన్నా సింహాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook