Mega family Diwali celebrations : మెగా ఫ్యామిలీలో దీపావళి సందడి
Diwali celebrations at Allu Arjun residence:దివాళికి అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోటుకు చేరి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.
Mega family Ram charan Allu Arjun Diwali and others Diwali celebrations at Allu Arjun residence: మెగా ఫ్యామిలీలో దీపావళి పండుగ సందర్భంగా ఫుల్ సందడి నెలకొంది. అల్లు ఫ్యామిలీ, (Allu Family) మెగా ఫ్యామిలీలు (Mega Family) ఒకచోట చేరి ఎంజాయ్ చేశాయి. ఈ దివాళికి అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోటుకు చేరి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.
ఇక ఫ్యాన్స్ కు హ్యాపీ దీపావళి అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫొటోలో రామ్ చరణ్, (Ram charan) అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక, చైతన్య, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు మెగా ఫ్యామిలీకి చెందని వారు ఉన్నారు.
Also Read : Acharya Second Single: ఆచార్య నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డేల నీలాంబరి పాట ప్రోమో వచ్చేసింది
అయితే సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఇంకా కోలుకోకపోవడంతో ఈ సెలబ్రెషన్స్‌లో కనిపించలేదు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప ఫస్ట్‌పార్ట్ (Floral First Part) డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలవుతుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది జానియర్ ఎన్టీఆర్‌తో (Jr NTR) కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంతో మన ముందుకు రానున్నాయి. జనవరి 7న ఈ మూవీ విడుదలకానుంది. ఇందులో రామ్‌చరణ్ (Ram charan).. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read : Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook