Allu Arjun - Pawan Kalyan Controversy: గత కొంతకాలంగా మెగా అభిమానులు అల్లు అర్జున్ మీద పగ పట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మాట్లాడే ప్రతి చిన్న మాట మీద ట్రోల్ చేస్తూ మెగా ఫాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కి కాకుండా అల్లు అర్జున్ వైసీపీ నాయకుడికి మద్దతు పలకడం అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ.. ఎప్పటినుంచి పుకార్లు వినిపిస్తూనే వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో అసలు ముందు ఎవరు ఎవరి మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఒక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ గొడవలు అన్నిటికీ నాంది పలికింది అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ స్టేట్మెంట్ అని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అభిమానులు ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తూ అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అనే స్టేట్మెంట్ ఇవ్వకముందే మెగా అభిమానులు ఈ గొడవను మొదలుపెట్టారు అని కామెంట్లు చేస్తున్నారు. 


ఆ వీడియోస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ స్టేజ్ మీద మైక్ తీసుకున్న వెంటనే మెగా అభిమానులు వద్దు వద్దు అన్నట్లు చేతులు ఊపుతున్నారు. ఇంకా ఆపేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోలో అల్లు అరవింద్ మీ అందరికీ ఎవరికీ తెలియని ఒక విషయం చెబుతాను అని చెప్పినా కూడా మెగా ఫాన్స్ ఏమాత్రం వినకుండా స్టేజ్ మీద నుంచి వెళ్ళిపొమ్మన్నట్లు సైగలు చేస్తున్నారు. 


ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలియదు ఆ విషయం చెబుతాను అంటూ అల్లు అరవింద్ మరొకసారి సరదాగా మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ మెగా అభిమానులు అయినా వినిపించుకోలేదు. దీంతో అల్లు అరవింద్ ని.. తీవ్రంగా అవమానించారు అంటూ అల్లు అభిమానులు హర్ట్ అయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ కూడా హర్ట్ అయ్యారు అని.. తన తండ్రిని అవమానించిన మెగా అభిమానులకు విషయంలో కోపం తెచ్చుకున్నారు అని అల్లు ఫాన్స్ చెబుతున్నారు. 


 



కాబట్టి దీన్నంతటికి కారణం మెగా అభిమానులే అని.. ఈ వార్ వాళ్లు కావాలని మొదలుపెట్టిందే అని.. సోషల్ మీడియాలో ఒక వీడియోని.. తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా వాళ్లలో వాళ్లు బాగానే ఉన్నా బయట మాత్రం అల్లు ఫాన్స్ మెగా ఫాన్స్ మధ్య ఒక రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. మరి వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి.


Also Read: Sana Ganguly: తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా? 


Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.