Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో ఇవాళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఈ ఈవెంట్‌కు హాజరవట్లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కల్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావట్లేదు. రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్... అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. 


ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం రాజమౌళి హాజరుకానున్నారు. అయితే పవన్ కల్యాణ్ రావట్లేదనే విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. పవన్ ఆచార్య ఈవెంట్‌కు వచ్చి ఉంటే... ఆ కిక్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.


యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ :


హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఇవాళ సాయంత్రం ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈవెంట్ నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సాయంత్రం 5గం. నుంచి రాత్రి 11గం. వరకు ఆ మార్గంలో వెళ్లే వాహనాలను వేరే మార్గాల్లోకి మళ్లించనున్నారు. పాస్‌తో వచ్చే వ్యక్తులను మాత్రమే ఈవెంట్‌కు అనుమతించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాస్‌ లేనివారిని లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో రాంచరణ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నెల 29న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. 


 



Also Read: Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు 'రియల్ ఎస్టేట్‌'కు దూరంగా ఉంటే మంచిది..  


Hyderabd: దారుణం.. అక్షింతలు వేస్తానని చెప్పి.. మహిళ తలపై ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన పూజారి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.