Ram Charan and Allu Arjun: ఎంత కుటుంబ సభ్యులు అయినప్పటికీ అల్లు, మెగా కుటుంబాల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని ఎప్పటికప్పుడు వార్తలు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటాయి. అల్లు అర్జున్ అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నాయని కొందరు కామెంట్లు చేయగా వారి మధ్య ఉన్న గొడవల కారణంగానే మెగా హీరోలు అల్లు వారింట జరిగే వేడుకలకి వెళ్లరని మరికొందరు చెబుతూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారి మధ్య బంధం ఎలా ఉన్నప్పటికీ అల్లు అభిమానులు, మెగా అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై చర్చించుకుంటూనే ఉంటారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ మరియు స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠి పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు మరొకసారి ఇలాంటి ఆసక్తికరమైన పుకారు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.


వరుణ్ మరియు లావణ్య ల పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ఇరు కుటుంబాలకి భారీ పార్టీ ని అరేంజ్ చేశారు. దాదాపు అందరూ మెగా హీరోలు ఈ వేడుకలు హాజరయ్యారు. అందరూ కలిసి కాబోయే జంట కి శుభాకాంక్షలు తెలిపారు. సాయి ధరం తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ లతో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ వేడుకలో కనిపించారు కానీ రామ్ చరణ్ మాత్రం ఎక్కడా ఈ ఫోటోలలో కనిపించలేదు. కావాలనే రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇచ్చిన ఈ పార్టీకి రాలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


అయితే కొద్ది రోజులు వెనక్కి వెళితే రామ్ చరణ్ కూడా లావణ్య మరియు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో భారీ పార్టీ ఇచ్చారు ఈ వేడుకలో కూడా అల్లు అర్జున్ కనిపించలేదు. తమ ఇంట్లో జరిగిన వేడుకలకి అల్లు అర్జున్ రాకపోవడంతో హర్ట్ అయిన రామ్ చరణ్ కావాలనే బన్నీ ఇస్తున్న ఈ పార్టీకి రాలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 


ఇక సినిమాల పరంగా చూస్తే అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు కరియర్ లో వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఈ మధ్యనే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప 2" తో బిజీగా ఉన్నారు. ఇక తెలుగు సినిమాకి ఆస్కార్ అందించిన "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.


Also Read: Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి