Mega Hero: మెగా హీరో కొత్త రిస్క్.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!
Varun Tej: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబానికి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాస్టార్ రామ్ చరణ్..ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ మొదట్లో విజయాలు సాధించి ఇప్పుడు.. తెగ కష్టాలు పడుతున్న హీరో మాత్రం వరుణ్ తేజ్.
Varun Tej Upcoming Movies: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఒకటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్న వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సక్సెస్ అందుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు వరుణ్ తేజ్.
సరైన కథ ఎంపిక చేసుకొని, సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఒక అతిపెద్ద సాహసం చేయడానికి సిద్ధం అవ్వడంతో అభిమానులు వద్దు బాబోయ్ అంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.అసలు విషయంలోకి వెళ్తే హిందీలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన కిల్ మూవీ సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి హిందీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినా.. సెప్టెంబర్ 24 నుంచి మాత్రమే తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ చూసి అభిమానులు ఇంత చెత్త సినిమాను ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే హిందీలో విడుదలైనప్పుడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమా తెలుగు రైట్స్ కొనుగోలు చేయడానికి నిర్మాతలు కూడా ఎగబడ్డారు.
ఫైనల్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఫాన్సీ రేట్ కి ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం జరిగింది. రాఘవ లారెన్స్ తో ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషలో తెరకెక్కిస్తున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల ఈ రీమేక్ ను ఇప్పుడు వరుణ్ తేజ్ తో తెరకెక్కించడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఊహించని విధంగా కిల్ మూవీ తెలుగు వర్షన్ కూడా ఓటీటీ లోకి అందుబాటులోకి రావడంతో.. రెండు రోజుల క్రితం నుంచి ఓటిటీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూస్తున్నారు . పైగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు. ఎలాగో తెలుగు వర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇక రీమేక్ చేస్తే ఉపయోగం ఉంటుందా? అనేది ఇప్పుడు చాలామంది ప్రశ్న. మరి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మానుకుంటాడా? లేక అదే అడుగు వేసి మళ్లీ డిజాస్టర్ పాలవుతాడా..? అనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.