Sai Durgha Tej: సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న సాయి దుర్గ తేజ్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ..
Sai Durgha Tej: అప్పట్లో ‘రిపబ్లిక్’ మూవీ టైమ్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి దుర్గ తేజ్.. ఆ తర్వాత కోలుకొని ‘విరూపాక్ష’ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో చిన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయకుండా సైలెంట్ గా ఉన్న సాయి ధరమ్ తేజ్.. సారీ సారీ.. సాయి దుర్గ తేజ్.. కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Sai Durgha Tej: విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘బ్రో’ వంటి యావరేజ్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు సాయి దుర్గ తేజ్. వరుస హిట్ ల తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విరూపాక్ష, బ్రో చిత్రాలతో రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన కథానాయకుడుగా సాయి దుర్గ తేజ్ రికార్డులకు ఎక్కాడు. ఈ సారి ఉరిమే ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
ల్యాండ్ మైన్‌లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కించ బోతున్నట్టు కనిపిస్తుంది. నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది.
ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట్‌తో ప్రస్తుతం ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎస్‌డీటీ 18 రూపొందుతోంది.
Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి