Bhola Shankar twitter review: భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్'(Bola Shankar) ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిరుకి జోడీగా తమన్నా, చెల్లెలు పాత్రలో కీర్తిసురేష్ నటించారు. ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే ప్రీమియర్స్ వీక్షించిన అడియెన్స్ మూవీపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ 'భోళాశంకర్' ఎలా ఉందంటే? 
కొందరు సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే.. మరికొందరు సూపర్ హిట్ అంటున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ బాగుందంటే.. ఇంకొందరు ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది అంటున్నారు. మరోవైపు సెకండ్ హాఫ్ లో చిరు ఎంట్రీ బాగుందని.. అంతేకాకుండా కోల్ కత్తా సెంటిమెంట్ మెగా ఫ్యామిలీకి మరోసారి కలిసొచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోరే హైలైట్ గా నిలిచిందని వేరొకరు తెలిపారు.



కొందరు మాస్ మాసాలా సినిమా అంటుంటే.. మరికొందరు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. అంతేకాకుండా చిరు-కీర్తి సురేష్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ఆకట్టుకున్నాయని తెలిపారు. మెగాస్టార్ కామెడీ, డైలాగ్స్, యాక్షన్, సెంటిమెంట్ తనదైన శైలిలో ఇరగదీశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు డీసెంట్ టాక్ వస్తుంది.  మెుత్తానికి చిరు భోళాశంకర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదే కొనసాగితే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. 



ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహారించగా.. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో తులసి, రఘు బాబు, రావు రమేష్​, ఉత్తేజ్​, వెన్నెల కిశోర్​, మురళీ శర్మ తదితరులు కీరోల్స్ చేశారు. ఈ మూవీ తమిళ సినిమా వేదాళంకు రీమేక్​ గా తెరకెక్కింది. 


Also Read: Jailer Movie HD Quality: జైలర్ మూవీ టీమ్‌కు షాక్.. నెట్‌లో HD ప్రింట్ లీక్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook