Actress Karthika Wedding: ఘనంగా హీరోయిన్ కార్తీక పెళ్లి.. హాజరైన చిరంజీవి.. ఫోటోలు వైరల్
Megastar Chiranjeevi: సీనియర్ నటి రాధ కుమార్తె హీరోయిన్ కార్తీక నాయర్ వివాహం చాలా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పలువురు సీనియర్ హీరోయిన్స్ హాజరయ్యారు.
Heroine Karthika Nair Wedding: సీనియర్ నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తీక నాయర్ వివాహం అంగరంగ వైభవంగ జరిగింది. ఇవాళ (నవంబర్ 19) ఉదయం రోహిత్ మేనన్‌తో మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టింది కార్తీక. ఈ తమిళ నటి పెళ్లి తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో.. కేరళ సంప్రదాయంలో జరిగింది. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్స్ రాధిక, సుహాసిని, రేవతి తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య హీరోగా నటించిన జోష్(2009) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కార్తీక. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఈమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత జీవాతో నటించిన రంగం సినిమాతో ఈ బ్యూటీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో నటించిన కార్తీకకు అంతగా అవకాశాలు రాలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం సినిమాలు చేసింది.ఈ అమ్మడు కొన్నాళ్లుగా సినిమాకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వ్యాపార రంగంలో రాణిస్తూ బిజీ అయిపోయింది.
Also Read: Miss Universe 2023 Winner: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ షెన్సిస్ పలాసియోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి