Megastar Chiranjeevi comes as chief guest for Ravi Teja's Ravanasura Movie launch event : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఖిలాడీ, రామారావు.. ఆన్ డ్యూటీ (Rama Rao On duty) ధమాకా (Dhamaka) టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswararao) చిత్రాలతో బిజీగా ఉన్నారు రవితేజ. ఇక ఈ సినిమాలన్నీ ఒక పక్క లైన్‌లో ఉండగానే.. సుధీర్ వర్మతో రావణాసుర (Ravanasura) మూవీలో నటిస్తున్నారు మాస్ మహారాజా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న రావణాసుర మూవీని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌ల‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా (SrikanthVissa) స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ (Dialogs) అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) అలాగే ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 


రావణాసుర సినిమా (Ravanasura Cinema) ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది. జనవరి 14న (January 14) రావణాసుర మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 


అయితే రావణాసుర సినిమా పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. కొత్త సంవత్సరం మెగా ఆరంభం అంటూ రావణాసుర మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. ఇంతకంటే సంక్రాంతి (sankranthi) కానుక మేము అడగలేదు.. తమ రావణాసుర మూవీ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకావడం అదృష్టమంటూ చిత్ర బృందం పేర్కొంది. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపింది మూవీ యూనిట్.



 


Also Read : Mouni Roy Bikini Photos: బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను డామినేట్ చేస్తున్న మౌనీరాయ్


ఇక ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరో సుశాంత్ (Sushant) ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఇక సుశాంత్ ఈ మూవీలో రామ్ పాత్రలో నటించనున్నాడు. రావణాసురలో రవితేజ (Ravi Teja) పది గెటప్స్‌లో కనిపించనున్నాడట.


Also Read : Chiranjeevi on AP Govt: ఏపీ ప్రభుత్వంపై నోరు జారొద్దు- సినీ ఇండస్ట్రీకి చిరంజీవి సూచన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook