Chiranjeevi on AP Govt: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ ముగిసిన అనంతరం మెగా స్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (Mega star Chiranjeevi on AP Govt) చేశారు. సినిమా టికెట్ ధరలపై అటు ఏపీ ప్రభుత్వం, ఇటు సీని ఇండస్ట్రీ మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆయన సీఎంను కలిశారు Chiranjeevi on AP ticket price issue చిరంజీవి. తమ భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.
ఈ విషయంపై (సినిమా టికెట్ల ధరలపై) అనవసరంగా ఎవరూ ప్రభుత్వంపై నోరు పారేసుకోవద్దని అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే జీవోలో మార్పులు తెస్తామని సీఎం జగన్ చెప్పినట్లు.. చిరంజీవి (Chiranjeevi on CM Jagan) వెల్లడించారు.
అయితే ఈ విషయాన్ని సినీ రంగం పెద్దగా చెప్పడం లేదని.. ఓ బిడ్డగానే చెబుతున్నానని పేర్కొన్నారు. పరిశ్రమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు చిరంజివి. అప్పటి వరకు అందరూ సమన్వయం పాటించాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు.. ఎవరు కూడా నోరు జారొద్దని, అనవసర విషయాలను మాట్లాడొద్దని తెలిపారు.
అసలు వివాదం ఇలా ప్రారంభం..
కొవిడ్ తర్వాత సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. కొవిడ్ సమయంలో అందరి ఆధాయాలు తగ్గిపోయాయని ఈ కారణంగానే టికెట్ల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా తగ్గించినట్లు పేర్కొంది ప్రభుత్వం.
ఈ విషయంపై గత కొన్ని నెలలుగా వివాదం చెలరేగుతూనే ఉంది. పవన్ కల్యాణ్‌తో మొదలుకుని.. హీరో నాని వరకు ఈ విషయంపై తమ అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంపై నాని చేసిన వ్యాఖ్యలు పెపద్ద దుమారమే లేపాయి.
ఇదిలా ఉండగా.. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత మంత్రి పేర్ని నానిను కూడా కలిశారు.
Also read: Anupama Parameswaran Photos: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న కేరళ క్యూటీ అనుపమ
Also read: Chiranjeevi Jagan meet : జగన్‌తో చిరంజీవి భేటీ వర్క్ అవుట్, 10 రోజుల్లో గుడ్ న్యూస్, కొత్త జీవో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook