కరోనా కేసులు, మరణాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఓ వైపు కోవిడ్19 వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతున్నా, నిబంధనలు, జాగ్రత్తలు పాటించని కారణంగా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం చికిత్స తీసుకున్నా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేను సైతం అంటూ కరోనా బాధితులకు సహాయం చేసేందుకు శ్రమిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిని ప్లాస్మా డొనేట్ చేసి మరో నలుగురి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘కరోనా సెకండ్ వేవ్‌లో బాధితులు మరింతగా పెరుగుతున్నారని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్లాస్మా కొరత వలన చాలా మంది ప్రాణాలకోసం పోరాడుతున్నారు. వారిని ఆడుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయం ఇది. మీరు కొద్ది రోజుల కిందట కరోనా బారి నుంచి కోలుకున్నవారైతే, మీ ప్లాస్మాని డొనేట్ చేయండి. దీనివల్ల మరో నలుగురు కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లాస్మా డొనేషన్ గురించి వివరాలకు, సరైన సూచనలకు చిరంజీవి(Chiranjeevi) ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీసుని సంప్రదించండి’ అంటూ 040 - 23554849, 94400 55777 నెంబర్లను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు.


Also Read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి 



తెలంగాణలో తాజాగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ మరో 49 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా(CoronaVirus) మరణాలు 2,417కి చేరినట్లు  తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook