Covid-19 Complications | కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. భారత్‌లో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల వరకు కరోనా కేసులు, వారంలో దాదాపు 25 వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో ఉన్న వారిని కోవిడ్19 మహమ్మారి కబలిస్తోందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఆ వివరాలు మీకోసం..
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. భారత్‌లో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల వరకు కరోనా కేసులు, వారంలో దాదాపు 25 వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో ఉన్న వారిని కోవిడ్19 మహమ్మారి కబలిస్తోందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఆ వివరాలు మీకోసం.. (Photo: thehealthsite) Also Read: COVID-19 Oxygen Levels: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి
అధిక బరువు (Over Weight)తో బాధ పడుతున్న వారికి సైతం కరోనా ముప్పు అధికంగా ఉంటుందని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు గుర్తించారు. బీఎంఐ 23kg/m2 ఉన్నవారిలో ఇతర పేషెంట్లతో పోల్చితే ఆసుపత్రిలో చేరే అవకాశాలు 5 శాతం అధికంగా ఉన్నాయని, ఐసీయూలో చేరే అవకాశం 10 శాతం అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. (Photo: thehealthsite) Also Read: COVID-19 Positive Children: కరోనా సోకిన చిన్నారులను ఎలా చూసుకోవాలి, కేర్ టేకర్స్ ఏమేం పాటించాలంటే
తక్కువ బరువు అంటే BMI 18.5 కన్నా తక్కువగా ఉన్నవారిలో కరోనా అధిక ప్రభావం చూపుతుంది. కరోనా సోకిన తరువాత దాని లక్షణాలు తీవ్రమై కచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని, కొన్ని సందర్భాల్లో మరణాలు సైతం సంభవిస్తాయని చెబుతున్నారు. బీఎంఐ అతి తక్కువగా ఉన్నా, అత్యధికంగా ఉన్న వారిలో కరోనా పెను ప్రభావం చూపుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) తెలిపింది. (Photo: thehealthsite) Also Read: Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు
గర్భిణులకు సైతం కరోనా సమయం కష్టకాలం కానుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గర్భిణులకు కరోనా సోకినట్లయితే వీరికి కోవిడ్19 లక్షణాలు అధికంగా కనిపిస్తాయని, తద్వారా సిజేరియన్ డెలివరీ, డెలివరీ తరువాత అధిక రక్తస్రావం, బీపీ లాంటి అంశాలు డెలివరీని క్లిష్టతరం చేస్తాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఓ అధ్యయనంలో గుర్తించింది. (Photo: thehealthsite)
డయాబెటిస్ (Diabetes) వ్యాధితో సతమతమవుతున్న వారిలో కరోనా లక్షణాలు అధికంగా కనిపిస్తాయని పలు అధ్యయనాలలో తేలింది. మధుమేహం సమస్య ఉన్నవారికి గుండె సంబంధిత సమస్య ఏదైనా ఉంటే పరిస్థితి మరింతగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. కనుక షుగర్ వ్యాధితో బాధపడేవారు కరోనా సోకకుండా అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (Photo: thehealthsite) Also Read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి
ఈబయోమెడిసిన్ అధ్యయనం ప్రకారం.. క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న చిన్నారులు, యువతీయువకులలో కోవిడ్19 బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ తమ జర్నల్‌లో ఈ విషయాలు తెలిపింది. వీరికి క్యాన్సర్ సోకితే ఇతరులతో పోల్చితే అధిక కాలం వీరిలో కరోనా లక్షణాలు కనిపిస్తాయి. (Photo: thehealthsite) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook