Chiru with PM Modi: టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ ఎక్కడైనా మెగాస్టారే అని మరోసారి నిరూపించుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందరివాడిగా గుర్తింపు పొంది..అందరితో శెహభాష్ అని కీర్తింపబడుతున్న మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జూలై 4వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. 


ఈ కార్యక్రమం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కిషన్ రెడ్డి..చిరంజీవిని కోరారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏడాది పాటు అంటే 2023 జూలై 4 వరకూ వివిధ కార్యక్రమాలు నిర్వహించనుందని కిషన్ రెడ్డి లేఖలో వివరించారు. మన్యం వీరుడిగా, హీరో ఆఫ్ జంగల్‌గా ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు అందరికీ సుపరిచితుడని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. నాటి బ్రిటీషు వ్యతిరేక పోరాటంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్ని ఏకం చేసి పోరాడిన వైనాన్ని మర్చిపోలేమని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 


ప్రధాని మోదీ కార్యక్రమంలో పాలుపంచుకోమని ఆహ్వానం రావడం అంత సులభమైన, సాధారణమైన విషయం కాదు. కొందమందికి మాత్రమే ఈ ఆహ్వానం లభిస్తుంది. అంతటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరడం విశేషం. ఈవార్త ఇప్పుడు చిరు అభిమానుల్లో బాగా వైరల్ అవుతోంది. 


Also read: Maharashtra Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బలనిరూపణ ఎప్పుడు, గవర్నర్ ఏమంటున్నారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి