Vishwambhara New Release Date: రీ ఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో మెగాస్టార్  పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ మూవీ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో  అందుకున్నాడు. కానీ చిరు ఇమేజ్ కు అది సరిపోలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోక పోయాయి.  ఇపుడు మెగాస్టార్ ఆశలన్ని ‘విశ్వంభర’ మూవీపైనే పెట్టుకున్నాడు. దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత చిరంజీవి .. మళ్లీ సోషియో ఫాంటసీ మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘బింబిసార’ వంటి  సోషియో ఫాంటసీ చిత్రంతో ఆడియన్స్ ను పలకరించిన వశిష్ఠ ఇపుడు చిరుతో ఆడియన్స్ ను కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నాడు. ముందుగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆ డేట్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తూన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కుమారుడు సినిమాకు పోటీ ఎందుకు అనుకొని తన సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసుకున్నాడు.  తాజాగా ఈ సినిమాకు తనకు గతంలో రెండు ఇండస్ట్రీ మూవీస్ అందించిన మే 9న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.


గతంలో ఇదే డేట్ లో 1991లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. ఆ తర్వాత ఇయర్ 1992 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అంతేకాదు మెగాస్టార్  చిరంజీవి కెరీర్ లో డిఫరెంట్ మూవీస్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తనకు ఎంతో కలిసొచ్చొన ఆ లక్కీ డేట్ లోనే తన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు తెలుస్తుంది.


‘విశ్వంభర’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ ఎక్స్ పెక్టేషన్స్  ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఔట్ పుల్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీటైనట్టు సమాచారం. చిరంజీవి కూడా తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తైయింది. విశ్వంభర చిత్రంతో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ లు కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు. చాలా యేళ్ల తర్వాత మెగాస్టార్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండటం విశేషం. ఈ మూవీ విజయం అనేది స్ అనేది చిరంజీవికి కీలకం అనే చెప్పాలి.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి నటించిన ఏ చిత్రాలు పూర్తిగా ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయలేకపోయాయి.  భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన  ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. ఆ తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన  ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ సినిమాలు ప్రేక్షకుల తిరస్కారినిక గురయ్యాయి. గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా హిట్టైయిన అందులో రవితేజ మరో హీరోగా ఉన్నాడు. కానీ రొటిన్ సబ్జెక్ట్ తో సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయిందనే కామెంట్స్ వినపడ్డాయి.  అందుకే ఇపుడు వశిష్ఠతో చేస్తోన్న ‘విశ్వంభర’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలని మెగాస్టార్ ఆశిస్తున్నారు. అభిమానులు కూడా ఈ సినిమాపై అదే స్థాయిలో హోప్స్ పెట్టుకున్నారు. మరి వారి ఎక్స్ పెక్టేషన్స్ ను విశ్వంభర మూవీ అందుకుంటుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ. 


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter