Megastar Chiranjeevi Waltair Veerayya Theatrical Trailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూర్తిస్థాయిలో విశాఖలోని వాల్తేరు నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద అంచనాలను పెంచేయగా ఇప్పుడు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాని మరో లెవెల్ కి తీసుకు వెళ్లిందని చెప్పాలి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక విడుదలైన ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య పాత్రలో ఒక ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్గా కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అదే విధంగా రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చూపించారు. అయితే వాల్తేరు వీరయ్య డ్రగ్స్ స్మగ్లర్ గా మారేందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు తాను కావాలని ఎరవేసి మీ దాకా వచ్చాను అంటూ ప్రకాష్ రాజు నా ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగులు చూస్తుంటే ఇదేదో రివెంజ్ డ్రామాలా అని అనిపిస్తోంది.


అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి పాత్రలో రవితేజ నటిస్తున్నారు అంటూ ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే విడుదలైన ట్రైలర్ ను బట్టి చూస్తే మాత్రం ఒకరు క్రిమినల్ గా మరొకరు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే కామెడీ టైమింగ్, డాన్స్ తో మెగాస్టార్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అయన నోటి వెంట వచ్చిన మాస్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.


అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పూర్తి స్థాయిలో రవితేజ వచ్చిన తర్వాత ట్రైలర్ లో అలాగే అభిమానుల్లో కూడా జోష్ వచ్చిందని చెప్పవచ్చు. జనవరి 13వ తేదీన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు విశాఖపట్నంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు, ఇక ట్రైలర్ చూసిన తర్వాత మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.


Also Read: MLA Kannababu: మాకు బాలకృష్ణ, చిరంజీవి ఎవరూ ఎక్కువ కాదు..కానీ పర్మిషన్ ఎందుకంటే?


Also Read: 6-Year-Old Boy Shoots : టీచర్ తిట్టిందని గన్ తీసి కాల్చేసిన ఆరేళ్ల బుడతడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook