Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర తెలిస్తే.. మీరు నోరెళ్లబెడతారు!
Chiranjeevi: సినీ స్టార్స్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే వారు ఖరీదైన బంగ్లాలు, కార్లు, వస్త్రాలు తదితర వస్తువులు ధరిస్తారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ధరించిన వాచ్ ధర నెట్టింట వైరల్ గా మారింది.
Megastar Chiranjeevi: సాధారణంగా సినీ ప్రముఖులు, క్రీడాకారులు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ ఉంటారు. వీరు ఏది ధరించినా నెట్టింట ఇట్టే వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్ వారి రెమ్యూనరేషన్ కు తగ్గట్టే కాస్ట్ లీ వస్తువులు ధరిస్తూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న వాచ్ ధర సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది. చిరుకి కార్ల కంటే కొత్త వాచీలంటనే ఇష్టమని పలు సంధర్భాల్లో చెప్పారు. అంటే మెగాస్టార్ వద్ద భారీగానే వాచ్ కలెక్షన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ తన చెల్లెలతో రాఖీ కట్టించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితో ఈ ఫోటోల్లో చిరు చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ను ఆయన పెట్టుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ దీని ధర ఎంతో ఉంటుందోనని నెట్టింట సెర్చ్ చేశారు. దాని రేటు రూ.2.35 లక్షల డాలర్లు అని ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2 కోట్లు అన్నమాట. ఈ విషయం తెలిసిన వారందరూ నోరెళ్లబెడుతున్నారు. మరోవైపు మెగాస్టార్ తండ్రి వెంకటరావు, మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలోఉంచి దేవుళ్లతో సమానంగా పూజించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి రీసెంట్ గా భోళాశంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కాస్తా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మెగాస్టార్ బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోని మూవీకి కూడా చిరు పచ్చజెండా ఊపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook