Miles of love Trailer: హుషారు చిత్రంలో నటించిన అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి (Abhinav Medishetti, Ramya Pasupuleti) ఇద్దరూ కలిసి జంటగా నటించిన చిత్రం మైల్స్ ఆఫ్ లవ్. ఉపేంద్ర కుమార్ కయ్యం అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై కంతాల వెంకట రాజి రెడ్డి నిర్మించారు. తాజాగా మేకర్స్ మైల్స్ ఆఫ్ లవ్ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే.. ఇటీవల కాలంలో వస్తున్న అనేక యూత్ స్టోరీ చిత్రాల మాదిరిగానే మైల్స్ ఆఫ్ లవ్ మూవీ కూడా ఉంటుందనే ఫీల్ కలిగించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవర్స్ మధ్య కన్‌ఫ్యూజన్స్, రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవడం, మళ్లీ కలవడం, ఈ గ్యాప్‌లో ఇంకొన్ని కొత్త స్నేహాలు, డేటింగ్స్, చాటింగ్స్, వగైరా వగైరా.. సీన్స్ అన్నీ మైల్స్ ఆఫ్ లవ్ ట్రైలర్‌లో (Miles of love Trailer) దర్శనమిచ్చాయి. 



Also read : Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్.. యూత్‌కి హీటెక్కించే సీన్స్


ప్రేమలో పడి, ఆ లవ్ స్టోరీ బ్రేకప్ అయ్యాకా లవర్స్ చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయో ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. అలాంటి డైలాగే పైన ట్రైలర్‌లో రాసుకున్న బాయ్స్ లవ్‌లో చాలా వీక్‌రా అనే డైలాగ్ కూడా. ఈ సినిమాలో ఇంకా ఏమేం షేడ్స్ ఉన్నాయో తెలియాలంటే అక్టోబర్ 29 వరకు (Miles of love Movie) వేచిచూడాల్సిందే.


Also read : Salman Antim Trailer: సల్మాన్ ‘'అంతిమ్‌’' ట్రైలర్‌ అదిరిపోయిందిగా


Also read : Pushpa 3rd Song Release Date: ప్రమోషన్స్​లో 'పుష్ప' రాజ్​ జోరు.. మూడో సాంగ్​ రిలీజ్​ ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook