RRR AP Tickets: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు!!
Minister Perni Nani about RRR Movie Ticket Rates In AP. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు.
Minister Perni Nani Gives Clarity on RRR Movie Ticket Rates In AP: స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ప్రతిఒక్కరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు. టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని, దాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మంత్రి మాటలను బట్టి చూస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్స్ రేట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
'టికెట్స్ రేట్ల విషయమై తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్యలు సీఎం జగన్ గారిని కలిశారు. టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆ దరఖాస్తుపై సీఎం సంతకం చేయనున్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ లాంటి వారి రెమ్యూనిరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి మాత్రమే వందకోట్ల బడ్జెట్ పెడితే.. అలాంటి సినిమాలకు విడుదలైన 10 రోజులు రేట్స్ పెంచుకొనే అవకాశం కల్పిస్తాం. అయితే ఇందుకోసం ముందుగా నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలి. ప్రజలపై భారం కాకుండా ఉండాలి. పెంచే టికెట్స్ రేట్లు సినిమాను ప్రజలు ఇష్టంతో చూసేలా ఉండాలి' అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Also Read: Viral Video: ఒక చేతిలో సిగరెట్.. మరో చేతిలో పాము.. ఈ యువతి ధైర్యానికి షాక్ అవ్వాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook