Mahesh Babu New Look: సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్.. ఇయర్‌బడ్స్‌ పగిలిపోయడం ఖాయం! మహేష్ లుక్ అదిరిపోలా!

Sarkaru Vaari Paata Second single Penny To release on March 20. సర్కారు వారి పాట సినిమా సెకండ్ సింగిల్‌కు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. పెన్నీ అంటూ సాగే ఈ పాటని మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 01:54 PM IST
  • సర్కారు వారి పాట సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్
  • ఇయర్‌బడ్స్‌ పగిలిపోయడం ఖాయం
  • మహేష్ బాబు లుక్ అదిరిపోలా
Mahesh Babu New Look: సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్.. ఇయర్‌బడ్స్‌ పగిలిపోయడం ఖాయం! మహేష్ లుక్ అదిరిపోలా!

Sarkaru Vaari Paata Second single Penny To release on March 20: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 వేసవి కానుకగా ఈ సినిమా మే 12న విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్ బాబు చివరగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం భారీ హిట్ కొట్టడంతో.. 'సర్కారు వారి పాట'పై అభిమానుల్లో అంతకు మించి అంచనాలు ఏర్పడ్డాయి. 

'సర్కారు వారి పాట' సినిమా నుంచి 2022 ఫిబ్రవరి 14న విడుదలైన మొదటి సాంగ్‌ 'కళావతి' యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 'ప్రేమికుల దినోత్సవం' సందర్భంగా రిలీజ్ అయిన ఈ పాటపై ప్రతిఒక్కరు రీల్స్ చేశారు. తాజాగా సెకండ్ సింగిల్‌కు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. పెన్నీ అంటూ సాగే ఈ పాటని మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ ప్రకటించారు. 'మార్చి 20న సర్కారు వారి పాట నుంచి సెకండ్ సింగిల్‌ రిలీజ్ అవుతుంది. మీ ఇయర్‌బడ్స్‌ మ్యూజిక్‌తో దద్దరిల్లడం పక్కా. సిద్ధంగా ఉండండి' అని ట్వీట్ చేశారు.  

సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు చేయడమే కాకుండా మహేష్ బాబు న్యూ పోస్టర్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో సూపర్ స్టార్ మహేష్ లుక్ అదిరిపోయింది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని లెదర్ జాకెట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్‌లో స్టైలిష్ గా ఉన్నారు. ముందుకు నడుస్తూ.. పక్కకు చూస్తున్న మహేష్ లుక్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పెన్నీ అంటే డబ్బులు అని అర్ధం. థమన్ అంత ధీమాగా చెబుతున్నాడు అంటే.. పెన్నీ సాంగ్ కళావతి కంటే హిట్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. 

Also Raed: Prithvi Shaw Yo Yo Test: యో-యో టెస్ట్‌లో పృథ్వీ షా ఫెయిల్‌.. అయినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతాడు!!

Also Read: RRR First Review: ఇండియా బాక్సాఫీస్‌ షేక్ అవుతుంది.. 3 వేల కోట్లు పక్కా! ఇది రాసిపెట్టుకోండి.. ఆర్ఆర్ఆర్ తొలి రివ్యూ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News