Brahma Mishra Mirzapur: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అభిమానులకు షాకింగ్ న్యూస్! ప్రముఖ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ లో లలిత్ పాత్ర పోషించిన నటుడు బ్రహ్మ మిశ్రా మరణించారు. ఈ విషయాన్ని దివ్యేందు శర్మ అలియాస్ మున్నా భాయ్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“RIP బ్రహ్మ మిశ్రా. మన లలిత్ ఇక లేరు. అందరూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం” అని బ్రహ్మ మిశ్రాతో ఉన్న ఫొటోను దివ్యేందు శర్మ పోస్ట్ చేశారు.


అయితే బ్రహ్మ మిశ్రా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బ్రహ్మ మిశ్రా అకాల మరణం గురించి తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు.. సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు.


"హార్ట్‌బ్రేకింగ్" అని నటి శ్రియా పిల్‌గావ్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ రచయిత గుర్మీత్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అతను కొన్ని లక్షల మంది ముఖాల్లో చిరునవ్వును తెప్పించారు. అతడ్ని (బ్రహ్మ మిశ్రా) మిస్ అవుతున్నాం. RIP బ్రహ్మ మిశ్రా" అని గుర్మీత్ సింగ్ స్పందించారు.


అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘మీర్జాపూర్’ సిరీస్ తో పాటు బాలీవుడ్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కేసరి’ సినిమాలోనూ బ్రహ్మ మిశ్రా నటించారు. 


Also Read: Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?


Also Read: Bangarraju Song Teaser: ‘బంగార్రాజు’ సినిమా నుంచి ‘నా కోసం’ సాంగ్ టీజర్ రిలీజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook