Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?

Akhanda Movie Review: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రం ‘అఖండ’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా.. నేడు (డిసెంబరు 2) థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? బాలకృష్ణ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకోవాలంటే ఈ సోషల్ మీడియా రివ్యూను చదివేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 10:58 AM IST
    • నేడు బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా విడుదల
    • ఫ్యాన్స్ తో సందడిగా నెలకొన్న సినిమా హాళ్లు
    • పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘అఖండ’ మూవీ
Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?

Akhanda Movie Review: నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’ (Akhanda Movie). యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా.. నేడు (డిసెంబరు 2) థియేటర్లలో (Akhanda Movie Release Date) విడుదలైంది. ఇప్పటికే కొన్ని విదేశాలు సహా యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. మూవీ చూసిన కొందరు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బెన్ ఫిట్ షోలు ప్రదర్శించారు. సినిమా రిలీజైన థియేటర్ల ముందు ఫ్యాన్స్ తో సందడి నెలకొంది. సినిమా చూసిన వారిలో అధిక శాతం సినిమా బాగుందని అంటున్నారు. ట్విట్టర్ లోనూ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. అనేక వెబ్ సైట్లు ఇచ్చిన రివ్యూలూ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మూడో చిత్రంతో హ్యాట్రిక్ సాధించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.  

సినిమా కథేంటంటే?

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రైతుగా కనిపించనున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనంతపురంలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి.. అందర్ని వ్యవసాయం వైపు మళ్లించే వ్యక్తిగా బాలయ్య తెరపై కనిపించనున్నారట. దీంతో పాటు ఆయన నివసిస్తున్న ఊరితో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో స్కూల్స్, ఆస్పత్రులు కట్టించి మంచి పేరు తెచ్చుకుంటారట. బాలయ్య చేసే మంచి పనులు చూసి.. ఆ జిల్లా కలెక్టర్ పాత్ర పోషించిన ప్రగ్యా జైశ్వాల్ ప్రేమించి పెళ్లాడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

అదే ప్రాంతంలో మైనింగ్ మాఫియాను నడుపుతున్న వ్యక్తిగా నటుడు శ్రీకాంత్ ఉన్నారట. అనంతపురం జిల్లాలోని యూరేనియం మైనింగ్ చేస్తుంటారట. యూరేనియం తవ్వకాలతో చిన్నారులకు ముప్పు అని తెలుసుకున్న బాలయ్య.. దాన్ని ఆపేందుకు రంగంలోకి దిగుతారట. అక్కడి నుంచి సినిమా మరింత ఆసక్తిగా సాగుతుందని చెప్పారు. అయితే ఈ సినిమాలోని ట్విస్ట్ తెలుసుకునేందుకు సినిమా కచ్చితంగా చూడాల్సిందేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. 

హిట్ కాంబో..

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే ‘సింహా‘, ‘లెజెండ్‘ సినిమాలు వచ్చాయి. అయితే  ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూడో చిత్రం ‘అఖండ‘ పై (Akhanda Movie Rating) భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను అందుకునేలా దర్శకుడు సినిమాను రూపొందించారని ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్య చిత్రం హిట్ (Akhanda Movie Review) రావడం వల్ల ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.   

Also Read: Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్

Also Read: Salman Khan in Telugu: మెగాస్టార్ చిరు సరసన నేరుగా తెలుగులో నటించనున్న సల్మాన్ ఖాన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News