Bangarraju Song Teaser: ‘బంగార్రాజు’ సినిమా నుంచి ‘నా కోసం’ సాంగ్ టీజర్ రిలీజ్

Bangarraju Song Teaser: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించిన ఈ సినిమా.. ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘నా కోసం’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 10:49 AM IST
    • ‘బంగార్రాజు’ సినిమా నుంచి మరో అప్డేట్
    • ‘నా కోసం’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రబృందం
    • గురువారం (డిసెంబరు 2) సాయంత్రం ఫుల్ సాంగ్ రిలీజ్
Bangarraju Song Teaser: ‘బంగార్రాజు’ సినిమా నుంచి ‘నా కోసం’ సాంగ్ టీజర్ రిలీజ్

Bangarraju Song Teaser: అక్కినేని స్టార్స్.. నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. దీంతో అటు ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించిన చిత్రబృందం.. మరోవైపు ప్రమోషన్స్ లోనూ జోరు చూపిస్తోంది.

ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో సాంగ్ ‘నా కోసం’ టీజర్ ను గురువారం (డిసెంబరు 2) ఉదయం విడుదల చేసింది చిత్రబృందం. 

 

 

‘నా కోసం’ సాంగ్ టీజర్ ఆకట్టుకునే విధంగా ఈ పాటలో అక్కినేని నాగ చైతన్య, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించారు. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ను ఈ రోజు బుధవారం (డిసెంబరు 2) సాయంత్రం 5.12 గంటలకు సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమాకూ అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Also Read: Bheemla Nayak - RRR Updates: సిరివెన్నెలకు సంతాపంగా ప్రమోషన్స్ ఆపేసిన ‘భీమ్లానాయక్’, ‘ఆర్ఆర్ఆర్’

Also Read: Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News