MLA Roja Shocking comments on Hero Nani in Cinema ticket rates isuue : సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్.. టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మూవీ టికెట్ రేట్స్ తగ్గించడంతో తెలుగు ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏపీ సర్కార్‌‌పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. కొందరు నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా టికెట్ రేట్స్‌ను భారీగా తగ్గించడం వల్ల ఇండస్ట్రీ దెబ్బ తింటుందనేది సినిమా పెద్దల వాదన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో సినిమా టికెట్ల రేట్ల (Movie ticket rates) విషయంలో ఏపీ ప్రభుత్వంపై హీరో నాని చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నాని చేసిన వ్యాఖ్యలపై (Nani comments) ఏపీ మంత్రులు స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే రోజా (MLA Roja) కూడా ఈ విషయంపై స్పందించారు.


ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఏం చేసినా కూడా అది పేదలకు మంచి జరిగేలా ఉంటుందని చెప్పారు. సినిమా టికెట్ల వ్యవహారంలో కేవలం పెద్ద సినిమాల గురించే కొందరు ఆలోచిస్తున్నారన్నారు. చిన్న సినిమాల గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం (AP Government) ఈ విషయంపై ఒక కమిటీ వేసిందని.. ఆ కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని రోజా అన్నారు.


Also Read : Liger Movie Glimpse: లేడీస్ అండ్ జంటిల్మెన్.. ఇట్స్ టైం.. లైగర్‌ మూవీ అప్డేట్..!!


ఇక హీరో నాని సినిమా థియేటర్ల (Movie theaters) కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందంటున్నారుగా.. అలాంటప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్ కదా.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు కదా అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. హీరో నాని (Hero Nani) చేసిన వాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని రోజా అన్నారు. ఇలాంటి కామెంట్స్ వల్లే తెలుగు సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ ఉనికిని చాటుకునేందుకు.. పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నాయని అన్నారు. "మా" ఎన్నికలు కూడా జనరల్ ఎలక్షన్‌లను తలపించడానికి కారణం కొందరి నోటి దూలనే అని అన్నారు. సినిమా ఇండస్ట్రీ (Film Industry) నుంచి మంచి ఉదేశంతో చర్చలకు వస్తే అన్ని సమస్యలను ఏపీ ప్రభుత్వం (AP Government) పరిష్కరిస్తుందని రోజా పేర్కొన్నారు.


Also Read : Anasuya Bharadwaj: మరో డీ గ్లామర్ పాత్రలో అనసూయ 'అలీస్'గా లుక్ అదుర్స్.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook