MM Keeravani on Bedrest: తెలుగు వారెవరికీ ఎం ఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు క్షణక్షణం సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన ఆయన ఆ తర్వాత తెలుగు వారందరికీ ఎంతో కావాల్సిన సంగీత దర్శకుడిగా మారిపోయారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆయన చేసిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా అమెరికా ఆస్కార్ అవార్డుల వేదిక మీద కీరవాణితో కలిసి ఆ సాంగ్ కి సాహిత్యం అందించిన చంద్రబోస్ సైతం ఆస్కార్ అవార్డు అందుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు కీరవాణి పూర్తిస్థాయి రేపు బెడ్ రెస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఒక హిందీ మీడియా సంస్థతో పంచుకున్నట్లుగా హిందీ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వరుస ప్రమోషన్లు, ప్రయాణాల తర్వాత ఇండియా వచ్చిన ఆయనకు కరోనా సోకినట్లుగా స్వయంగా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కొంచెం నలతగా అనిపించడంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారని దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని ఎంఎం కీరవాణి పేర్కొన్నారు.


అయితే ఈ విషయం ఎక్కడా తెలుగు మీడియాలో ఇంకా వెల్లడి కాకపోవడం గమనార్హం. తాను ప్రస్తుతానికి బాగానే ఉన్నానని ఇంట్లోనే ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నానని కీరవాణి ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే హిందీ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం నిజమేనా? కాదా? అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ లేదు. నిజానికి కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకత్వానికి గుడ్ బై చెప్పాలని భావించిన కీరవాణి ఆ తర్వాత తాను చెప్పినట్లు తాను ఇచ్చిన సంగీతం తీసుకునే దర్శకులకు మాత్రమే పని చేస్తానని కండిషన్ పెట్టుకున్నారు.


ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు సహా మరికొన్ని సినిమాలకు కూడా ఆయన పని చేస్తున్నారు. అయితే కీరవాణి ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదని ఆయన పూర్తిస్థాయి బెడ్ రెస్ట్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప కొంత ఈ విషయంలో ప్రచారానికి బ్రేకులు పడే అవకాశం కనిపించడం లేదు.


Also Read: Actor Innocent death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ కమెడియన్ మృతి


Also Read: Akanksha Dubey Suicide: హోటల్ గదిలో ఉరేసుకున్న స్టార్ హీరోయిన్.. పవర్ స్టార్ పవన్ తో చివరి సాంగ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook