Mohan Babu Files Complaint: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబంలో గొడవలు అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు , మంచు మనోజ్ మధ్య గొడవలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు ప్రధాన అధికారి అయిన వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేశాడు. అంతేకాదు రౌడీ మూకలతో భారీగా కొట్టించాడు కూడా.. ఈ నేపథ్యంలోనే గాయాలతో డయల్ 100 కి ఫోన్ చేసిన మంచు మనోజ్.. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈరోజు తాజాగా పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  అయితే ఆయన తన తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సీఐ గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. 


ఇకపోతే మంచు మనోజ్.. తనపై దాడి చేసిన వినయ్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వినయ్ ముఖ్యంగా మోహన్ బాబు విద్యానికేతన్ విద్యాసంస్థలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈయన మోహన్ బాబు మేరకే తనపై దాడి చేసిన విషయం తెలిసినా.. మనోజ్ మాత్రం తండ్రి పైన గౌరవంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. 


అయితే ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ పై మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నా కొడుకు నుండి నాకు ప్రాణహాని ఉంది. నన్ను రక్షించండి మహాప్రభో అంటూ రాచకొండ సిపీకి సినీ నటుడు మోహన్ బాబు లేఖ రాసినట్లు సమాచారం. ముఖ్యంగా మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని రక్షణ కావాలని మోహన్ బాబు కోరారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.


ఇకపోతే ఇది చూసిన అభిమానులు మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి దాడి చేసినా కూడా తండ్రిని కాపాడడం కోసం కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు పై కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన పెద్దరికం ని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నట్లు తెలిసింది.


Also Read: IRCTC Christmas Special Package: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC చీప్‌ అండ్‌ బెస్ట్ థాయ్‌లాండ్ ట్రిప్‌ మీ కోసం..  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూ


స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook