Soundarya Bangla: 100 కోట్ల జల్‌పల్లి బంగ్లా ఎవరిది, సౌందర్య నుంచి లాక్కున్నారా గొడవకు కారణమిదేనా
Soundarya Bangla: మంచు కుటుంబ వివాదం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడితే చర్చనీయాంశమౌతోంది. అదే సమయంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మరణించిన సౌందర్య పేరు తెరపైకి వచ్చింది. అసలు మంచు వివాదానికి, సౌందర్యకు సంబంధమేంటో చూద్దాం.
Soundarya Bangla: మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో మంచు కుటుంబం పరువు రోడ్డునపడింది. ఫ్రస్ట్రేషన్‌కు గురైన మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో వివాదం మరింత పెరిగింది. మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఎపిసోడ్‌కు జర్నలిస్టులు తోడయ్యారు. ఇప్పుడు కొత్తగా మాజీ నటి దివంగత సౌందర్య పేరు విన్పిస్తోంది.
మంచు ఇంటి గుట్టు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకుల ఘర్షణ పోలీస్ స్టేషన్ దాటి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నాలుగ్గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ పేచీ వీధికెక్కింది. తండ్రీ చిన్న కొడుకుల వివాదంలో ఇప్పుడు తండ్రి తరపున విష్ణు వచ్చి చేరాడు. ఒకరిపై మరొకరు డెడ్‌లైన్స్ ఇచ్చుకున్నారు. ఈ ఇరువురి మధ్య వివాదం ఇలా ఉంటే కొత్తగా 20 ఏళ్ల క్రితం మరణించిన టాలీవుడ్ నాటి మేటి నటి సౌందర్య పేరు వచ్చి చేరింది. సౌందర్యకు మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు వివాదానికి సంబంధమేంటని అనుకుంటున్నారా..సంబంధం ఉంది. తండ్రీ కొడుకుల మధ్య వివాదానికి కారణమైందిగా భావిస్తున్న జల్‌పల్లి బంగ్లా నుంచి సౌందర్య పేరు వచ్చి చేరింది. శంషాబాద్ శివారు ప్రాంతంలోని జల్‌పల్లిలో భారీ బంగ్లా ఉంది. ఇది రాజ భవనాన్ని తలదన్నేలా ఉంటుంది. దీనివిలువ ప్రస్తుతం 100 కోట్లు ఉండవచ్చని అంచనా.
జల్‌పల్లి ఆస్థి సౌందర్యదా
అసలు ఈ బంగ్లా కట్టిన స్థలం గతంలో మాజీ నటి సౌందర్యదని తెలుస్తోంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడు తన సంపాదనతో ఇక్కడ భూమి కొనుగోలు చేసి చిన్న బంగ్లా కట్టుకుందని సమాచారం. ఆమె మరణానంతరం ఆమె కుటుంబసభ్యుల నుంచి మోహన్ బాబు ఈ బంగ్లా కొనుగోలు చేసి బంగ్లాను పెద్దది చేసి విలాసవంతంగా మార్చారని అంటారు. ఇంకొందరైతే ఈ ఆస్థిని మోహన్ బాబు అప్పట్లో సౌందర్య కుటుంబం నుంచి లాక్కున్నారని విమర్శించేవాళ్లు కూడా లేకపోలేదు.
మనోజ్ వర్సెస్ మోహన్ బాబు వివాదానికి జల్‌పల్లి బంగ్లాకు సంబంధం
ఇప్పుడు తండ్రీ కొడుకుల మధ్య వివాదమంతా ఈ బంగ్లా కోసమేనని తెలుస్తోంది. ఆస్థి పంపకాలు జరిగితే ఈ బంగ్లా తనకు చెందాలని మంచు మనోజ్ అడుగుతున్నట్టు సమాచారం. అయితే మనోజ్ రెండో పెళ్లి, భూమా మౌనిక, మౌనిక మొదటి భర్తతో కలిగిన సంతానం మనోజ్‌తో ఉండటం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ బంగ్లాను ఇచ్చేందుకు నిరాకరించాడని సమాచారం. ఇదే తండ్రీ కొడుకుల మధ్య వివాదానికి కారణమైంది. చిలికి చిలికి గాలివానలా మారి ఇంటి పరువు కాస్తా రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులతో పోకుండా ఎప్పుడో చనిపోయిన సౌందర్యను తెరపైకి లాగింది.
Also read: Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో ట్విస్ట్, 10 లక్షల సూట్‌కేసుతో అవినాష్ అవుట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.