Mohan Babu Health Bulletin: మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఘర్షణ రోడ్డెక్కింది. మీడియా ప్రతినిధిపై దాడితో మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారింది. అటు కొడుకుతో ఇటు మీడియాతో గొడవ నేపధ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొడుకు మంచు మనోజ్‌తో గొడవ కాస్తా మీడియాతో వైరానికి దారి తీసింది. ఫలితంగా తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురైన మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో రక్తపోటు వచ్చింది. దీనికి తోడు బాడీ పెయిన్స్ బాధించాయి. ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ సైతం విడుదల చేసింది. 


మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయమైందని, బీపీ అధికంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆందోళనకు గురి కావడంతో పాటు బాడీ పెయిన్స్ సమస్యలున్నాయని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యులతో ఆయనకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. రక్తపోటు అధికమవడంతో ఎడమ కంటి సమస్య తలెత్తిందని, హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అవుతోందని తెలిపారు. వయస్సు, ఆరోగ్య దృష్ట్యా కార్డియాలజిస్ట్, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స అవసరమని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 


Also read: AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.