Son of India Teaser review: మోహన్ బాబు అప్‌కమింగ్ మూవీ సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. నటుడు సూర్య సన్ ఆఫ్ ఇండియా టీజర్‌ను లాంచ్ చేశాడు. ఈ మూవీ టీజర్‌కు ఉన్న మరో విశేషం ఏంటంటే... సన్ ఆఫ్ ఇండియా మూవీలో మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని, మోహన్ బాబు పాత్రను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ అందించడం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రచయిత డైమండ్ రత్న బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. స్వతహాగా రచయిత అయిన రత్న బాబు తానే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం మంచి పంచ్ డైలాగ్స్ రాసుకున్నట్టు టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో మోహన్ బాబు వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో, మారు వేషాల్లో కనిపించనున్నట్టు టీజర్ స్పష్టంచేస్తోంది. అందుకు తగినట్టుగానే పాత్రపై హైప్ పెంచుతూ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ ఇచ్చారు. 



Also read : The family man 2: ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌‌లో Samantha ఎంట్రీ సీన్ చూశారా ?


గతంలో మోహన్ బాబు (Mohan Babu) నటించిన ఎన్నో చిత్రాలకు గొప్ప మ్యూజిక్ అందించిన మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా (Ilaya Raja music) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.


Also read : Mahesh Babu: మరోసారి pokiri గెటప్‌లో మహేష్ బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook