Mohan Babu: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న నటుడు మోహన్ బాబు, ప్రజలకు విజ్ఞప్తి

Mohan Babu Receives 2nd dose of Corona Vaccine:  పలువురు సెలబ్రిటీలు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు బాధ్యతగా కోవిడ్19 టీకాలు తీసుకుంటున్నారు. మరోవైపు సెకండ్ వేవ్‌లో భయానక వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు కరోనా టీకా తీసుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 25, 2021, 12:00 PM IST
Mohan Babu: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న నటుడు మోహన్ బాబు, ప్రజలకు విజ్ఞప్తి

Mohan Babu Receives 2nd dose of Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన వారందరినీ వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టీకాల పంపిణీని వేగవంతం చేశాయి. పలువురు సెలబ్రిటీలు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు బాధ్యతగా కోవిడ్19 టీకాలు తీసుకుంటున్నారు. మరోవైపు సెకండ్ వేవ్‌లో భయానక వాతావరణం నెలకొంది.

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు కరోనా టీకా తీసుకున్నారు. అనంతరం అర్హులైన అందరూ కరోనా టీకాలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మోహన్ బాబు ట్వీట్ చేశారు. గత నెలలో తొలి డోసు తీసుకోగా, నటుడు మోహన్ బాబు ఆదివారం నాడు కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. అందరూ తమ వంతు బాధ్యతగా కోవిడ్19 టీకాలు తీసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళితే కచ్చితంగా ముఖానికి మాస్కులు ధరించాలని సూచించారు.

Also Read: COVAXIN Vaccine Price: కోవాగ్జిన్ టీకా ధరలు ప్రకటించిన భారత్ బయోటెక్

కాగా, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,126 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232కి చేరింది. కోవిడ్19 బారిన పడి మరో 38 మంది మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారు సైతం టీకాలు తీసుకునేందుకు అర్హులని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

Also Read: COVID-19 Positive Children: కరోనా సోకిన చిన్నారులను ఎలా చూసుకోవాలి, కేర్ టేకర్స్ ఏమేం పాటించాలంటే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News