First single from Dear Krishna:  మలయాళం హిట్ సినిమా ప్రేమలు తో తెలుగు ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధుల్ని చేసిన మమితా బైజు హీరోయిన్ గా.. అక్షయ్ హీరోగా.. త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా డియర్ కృష్ణ. పీ ఎన్ బలరాం ఈ సినిమాకి కథ అందించడం మాత్రమే కాకుండా.. సినిమాని నిర్మించారు కూడా. దినేష్ బాబు ఈ సినిమా డైలాగ్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం కూడా వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana DAs: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి పటాకా.. రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే?


హరి ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి రాజీవ్ రామచంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తాజాగా లాలెట్టన్ మోహన్ లాల్ చేతుల మీదుగా ఈ సినిమా నుండి ఫస్ట్ పాట అయిన చిరుప్రాయం విడుదల చేశారు. ఇది ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ఆఖరి పాట కావడం విశేషం. పిఎన్బి సినిమాస్ వారు నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్య కీలక పాత్రలో కనిపించనుంది. 


నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని.. బలరాం ఈ సినిమా కోసం యువతకు నచ్చే విధంగా ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కథను రూపొందించారు. హృదయాన్ని తాకే లాగా ఉండే ఒక విషాద సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఏమీ చేయలేము అని డాక్టర్లే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో జరిగిన ఒక అద్భుతమైన మిరాకిల్ గురించి ఉంటుంది ఈ కథ. భారం మొత్తం శ్రీకృష్ణుడి మీద వేసిన భక్తులు ఈ కథకి బాగా కనెక్ట్ అవుతారు. 


 


Also Read: KTR: బరాబర్‌ జైలుకు పోతా.. రేవంత్‌ రెడ్డి అయ్యకు కూడా భయపడను


 


ఎవరు నమ్మలేని కథ.. ఎవరు ఊహించలేని స్క్రీన్ ప్లే రాసిన ఆ భగవంతుడు శ్రీకృష్ణుడికి దయతోనే ఈ సినిమాని నిర్మించినట్లు నిర్మాత తెలియజేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేస్తూ..  మోహన్ లాల్ గారు మాట్లాడుతూ.. “శ్రీకృష్ణుడు చేసిన ఒక మిరకిల్ పాయింట్ ఆధారంగా తీసిన ఈ సినిమాలోని పాటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ఫస్ట్ పాట చిరుప్రాయం నా మనసుకు బాగా హత్తుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఈ పాట మీ హృదయాలను కూడా కచ్చితంగా హత్తుకుంటుంది. ఈ పాటలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు,” చెప్పారు.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి