Mohini Dey On Ar Rahman: రెహామాన్తో నాకున్న రిలేషన్ అదే.. షాకింగ్ నిజం రివీల్ చేసిన మోహినీ డే.. వీడియో వైరల్..
Ar Rahman: సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వీరి విడాకులు వెనుక అనేక రూమర్స్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మోహినీ డే అనే బాసిస్ట్ సింగర్ లో ఎఫైర్ నడిపించారని ప్రచారం జరిగింది.
Mohinidey reacts to link up rumors with ar Rahman video: ఏఆర్ రెహమాన్ విడాకులు అంశం ప్రస్తుతం తెగ వార్తలలో ఉంటుంది. ఈ నేథ్యంలో.. సైరా భాను.. తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో పెనుసంచలనంగా మారింది. దాదాపు.. 29 ఏళ్ల బంధానికి సైరాభాను, ఏఆర్ రెహమాన్ పుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా ఇది తమ వ్యక్తిగత అంశమని దీనిపై రూమర్స్ వ్యాప్తి చేయోద్దని కూడా.. ఇన్ స్టా వేదికగా రెహామన్ సతీమణి పోస్టు చేశారు. వీరికి ముగ్గురు సంతానం. తమతల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించాలని పిల్లలు కూడా పోస్టులు చేశారు.
అయితే.. ఏఆర్ రెహమాన్ విడాకులు అనౌన్స్ మెంట్ వచ్చిన కొన్ని గంటలకే ... ఆయన దగ్గర పనిచేసిన బాసిస్ట్ సింగర్ మోహినీ డే సైతం.. తన భర్తతో విడాకులు ప్రకటిచింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో విపరీంగా ప్రచారం జరిగింది. వీరిద్దరు కూడ పెళ్లి చేసుకుంటారని వార్తలు వైరల్ చేశారు.
దీనిపై రెహమాన్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఫెక్ వార్తలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోస్టులుతొలగించాలని కూడా స్పష్టం చేశారు. అయితే.. దీనిపై ఇప్పటికే మోహినీడే స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా.. రెహమాన్ తో తనకు ఉన్న రిలేషన్ ను మోహినీ డే రివీల్ చేసింది. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
మోహినీడే తాజాగా, ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను.. ఏఆర్ రెహామాన్ దగ్గర దాదాపు.. ఎనిమిదేళ్లకు పైగా పనిచేశానని.. ఆయన తనను తండ్రిలాగా చూసుకున్నారని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా..ఆయనను తాను.. తండ్రిలాగా భావిస్తున్నానని.. దయచేసి.. లేని రూమర్స్ వ్యాప్తి చేయోద్దని కూడా మోహినీ డే వీడియోను రిలీజ్ చేశారు.
ఇలాంటి భావోద్వేగాల సమయంలో ఒకరికి అండగా లేకున్నా.. లేని పోని రూమర్స్ దయచేసి వ్యాప్తిచేయోద్దని చెప్పినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం మోహినీడే మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారింది.