Lakshmis Ntr Actor: చిక్కుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి.. ఏంచేశాడంటే..?

Actor Sritej: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఈ  ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 26, 2024, 02:17 PM IST
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ విలన్ పై ఆరోపణలు..
  • కేసు నమోదు చేసిన పోలీసులు..
Lakshmis Ntr Actor: చిక్కుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి.. ఏంచేశాడంటే..?

Case filed against lakshmis ntr actor sri tej:  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సర్కారు ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ట్రోలింగ్ లకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. ట్రోలర్స్ కు దిమ్మతిరిగే విధంగా షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని, శ్రీరెడ్డి లపై  కేసులు నమోదైన విషయం తెలిసిందే.

గతంలో వీరంతా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఆయన సతీమణిపై ఇష్టమున్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరిపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. అయితే.. మరోవైపు వైసీపీ మాత్రం.. తమను అణచివేసేందుకు చంద్రబాబు సర్కారు.. ఇలా ప్రతీకార రాజకీయాలు చేస్తుందని మండిపడుతున్నారు.

అదే విధంగా మహిళలపై అఘాయిత్యాలు జరక్కుండా కఠినంగా చర్యలు తీసుకొవాలని కూడా.. చంద్రబాబు సర్కారు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రలో నటించిన శ్రీతేజపై తెలంగాణలో కేసు నమోదైంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో.. చంద్రబాబు పాత్రలో.. శ్రీతేజ్ నటించాడు. గతంలో ఇతను ఒక యువతిని ట్రాప్ చేసి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని సదరు యువతి..హైదరబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే.. గతంలో కూడా.. శ్రీతేజ్పై మాదాపూర్ లో పీఎస్ లో కూడా కేసు నమోదైనట్లు సమాచారం.

Read more: Ram Gopal Varma: పరారీలో రామ్ గోపాల్ వర్మ..?.. ఏపీ హైకోర్టు ఎదుట మూడు బెయిల్ పిటిషన్లు.. తీవ్ర ఉత్కంఠ.

 

ఒక పెళ్లైన మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలపైకేసు నమోదైంది. ఈ క్రమంలో తాజాగా, మరోసారి కేసు నమోదు కావడం మాత్రం పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని తెలుస్తొంది.
 

Trending News