Mokshagna Debut Movie Herione: నటసింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు గత ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. అదిగో ఇదిగో అంటూ సంవత్సరాలు దాటించారు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు సెప్టెంబర్ 6 వ తేదీన మోక్షజ్ఞ పుట్టిన రోజు కావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హనుమాన్ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని, స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు చేపట్టారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ప్రీ  ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం.


అసలే ఐదు సంవత్సరాల తర్వాత.. నటన రంగంలోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని అభిమానులు సంతోషపడేలోపే ఇప్పుడు సడన్గా హీరోయిన్ ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధంలో డైరెక్టర్ పడేసరికి మూవీకి మళ్ళీ చిక్కులు వచ్చాయి అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జై హనుమాన్ సినిమా చేస్తున్న ఈయన..  మరోవైపు అధీర సినిమా కూడా చేస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినిమా ప్రకటించాడు. మరీ  ఆలస్యం చేయకుండా మోక్షజ్ఞ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే హీరోయిన్ ఎంపిక విషయంపై చర్చలు జరుగుతున్నాయి. 


మోక్షజ్ఞ మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాకి నార్త్ బ్యూటీ అయితే బాగుంటుందని అదే కాకుండా గుర్తింపు ఉన్న హీరోయిన్ అయితే ఇంకా బెటర్ అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారట. ప్రశాంత వర్మ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 


దీనికి తోడు జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ ను..  మోక్షజ్ఞ కి జోడిగా నటింపచేసే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరగగా.. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. కానీ ఇప్పటికే బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలైనా చేసి మంచి గుర్తింపు అందుకున్న హీరోయిన్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారట.  మరి ఇలాంటి సందిగ్ధంలో ప్రశాంత్ వర్మ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది.


Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే


Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.