KG George: మాలీవుడ్ లో విషాదం.. లెజండరీ డైరెక్టర్ కన్నుమూత..
KG George dies: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ కన్నుమూశారు. ఆయన మృతి మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కేరళ సీఎం అన్నారు.
Malayalam filmmaker KG George Passes away : ఫిలిం ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులగా పక్షవాతంతోపాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కక్కనాడ్‌లోగల ఓ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మంగళవారం జార్జ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమం తెలిపింది.
1976లో 'స్వప్నదానం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు జార్జ్. తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి సక్సెస్ పుల్ చిత్రాలను తెరకెక్కించారు. తన కెరీర్‌లో తొమ్మిది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆయన మలయాళ సినిమాకి చేసిన సేవలకు గుర్తింపుగా 2016లో కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. ఈయన ఫిలిం స్కూల్ ను కూడా స్థాపించారు.
కేజీ జార్జ్ మృతి మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కేరళ సీఎం పినరయి విజయన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కళాత్మక, వాణిజ్య సినిమాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఆయన కృషి చేశారని విజయన్ అన్నారు. ఈయన మలయాళ సింగర్ సెల్మా జార్జ్ ను 1977లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: Ram Pothineni: విరాట్ కోహ్లీ బయోపిక్‍పై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి