బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అఖిల్‌కి ( Akhil Akkineni ) ఇండస్ట్రీలో సరిగా హిట్లు లేకపోవడంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. నాగార్జున కూడా కొడుక్కి హిట్ అందించడం కోసం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించాడు అని టాక్. లాక్‌డౌన్ కారణంగా చివరి దశలో షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల తిరిగి ఈ చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించింది. Also read : Bigg Boss Telugu 4: కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడా..! పంపించేశారా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి సంబంధించి ఈ సినిమా యూనిట్ ప్రీ టీజర్ వీడియోను ( Most eligible bachelor pre-teaser )  విడుదల చేసింది. ప్రీ టీజర్‌‌లో ముందుగా ఈ సినిమాలో అఖిల్ పేరు 'హర్ష' అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ( Marriage life ) ఉంటుంది. కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే... అయ్యయ్యయ్యో..’ అని చెబుతూ పరోక్షంగా మ్యారీడ్ లైఫ్‌ని ( Married life ) బ్యాలెన్స్ చేయడం కష్టమనే సంకేతాలిస్తూ ఊగిపోవడాన్ని ఈ ప్రీ టీజర్ వీడియోలో చూడొచ్చు. ఈ దసరా పండుగ ( Dussehra festival ) సందర్భంగా అక్టోబర్ 25న ఉదయం గం. 11.40 లకు ఈ సినిమా టీజర్‌ను ( Most eligible bachelor teaser ) విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. Also read : Rashmika Mandanna: రష్మికకు కోటి మంది ఫాలోవర్స్


టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన లక్కీ మస్కట్‌గా మారిన పూజా హెగ్డే ( Actress Pooja Hegde ) ఈ సినిమాలో అఖిల్ సరసన జంటగా నటిస్తోంది. కనీసం ఈ లక్కీ హీరోయిన్‌తోనైనా అఖిల్‌కి లక్ కలిసి వస్తుందేమో చూడాలి మరి. బన్నీ వాస్, వాసు వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రజంట్ చేస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. Also read : Vakeel Saab shooting: వకీల్ సాబ్ షూటింగ్‌కి పవన్ కల్యాణ్ రెడీ