Mouni Roy Wedding Pics: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మౌనీ రాయ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు సూరజ్ నంబియార్ తో గురువారం పెళ్లాడింది. గోవాలోని ఓ రిసార్ట్ అందుకు వేదిక అయ్యింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి ఫొటోల్లో మౌనీ రాయ్ ఎరుపు, తెలుపు రంగు చీర ధరించగా.. సూరజ్ గోధుమ రంగు షెర్వాణీలో కనిపించాడు. తమ పెళ్లి ఫొటోలను మౌనీ రాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 



బుధవారం ప్రీవెడ్డింగ్ వేడుకలు


మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి వేడుకకు ముందస్తు కార్యక్రమాలు బుధవారం జరిగాయి. మెహందీ, హల్దీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ నటి మందిరా బేడీ పాల్గొంది. నూతన వధూవరులిద్దరికి పసుపు పూసి పవిత్ర స్నానం చేయించింది. ఈమెతో పాటు మౌనీ రాయ్ స్నేహితులు ఆష్కా గౌరాడియా, అర్జున్ బిజ్లా వారి వారి ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో మౌనీ రాయ్ మెహందీ ఫంక్షన్ ఫొటోలను పంచుకున్నారు. 


దుబాయిలో పెళ్లి అనుకున్నా..


అయితే మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి వేడుకను తొలుత దుబాయి జరపాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతిథులకు ఇబ్బందులు కలగొచ్చని ఆలోచనతో గోవాలో పెళ్లి తంతును నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పెళ్లికి వచ్చే అతిథులు తప్పకుండా కరోనా టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన పెట్టారంట. పెళ్లి ముగిసిన వెంటనే.. ముంబయిలో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.   


Also Read: Mouni Roy Wedding: గోవాలో మౌనీరాయ్ పెళ్లి.. హల్దీ ఫంక్షన్ లో నాగిని బ్యూటీ సందడి


Also Read: Pia Bajpiee Photos: రంగం సినిమా హీరోయిన్ ఇప్పుడెలాగ ఉందో చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook