Mr Bachchan Day 1 Collections: మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ వంటి ఆసక్తికరమైన సినిమాల.. తరువాత వచ్చిన మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ హిందీలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా.. ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడుదలకి ముందు నుంచే.. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. మంచి అంచనాల మధ్య.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 


అయితే విడుదలైన మొదటి రోజున ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చిపెట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు కేవలం హీరోయిన్ కోసం తీశారు అంటూ.. ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా.. ఓవర్ ఆల్ గా మొదటి రోజున 41.18 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఇక మొదటి రోజున ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ కలిపి 3.5 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది. అయితే ముందు రోజే సినిమాకి.. సంబంధించిన ప్రీమియర్లు పడ్డ సంగతి తెలిసిందే. 


ఆగస్టు 14 రోజున పడిన చిత్ర ప్రీమియర్లతో 1.8 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది ..మిస్టర్ బచ్చన్. అంటే ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు పూర్తయ్యేసరికి 5.3 కోట్ల కలెక్షన్ ను నమోదు చేసుకుంది. ఒకవైపు సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ వారాంతమే కాబట్టి సినిమా కలెక్షన్లు..పెరిగే అవకాశం లేకపోలేదు. 


రవితేజ ఈ సినిమాలో.. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. జగపతిబాబు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా పేరుకి రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ తనదైన శైలిలో సినిమాలో ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేసి తెరకెక్కించారు.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter