Harish Shankar: త్రివిక్రమ్ గారి మీద ఎంత కోపం వచ్చిందంటే.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్..!
Harish Shankar - Trivikram Srinivas: డైరెక్టర్ హరీష్ శంకర్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవలు ఉన్నాయి అని ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఒక మిస్టర్ బచ్చన్.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరీష్ శంకర్ దీని గురించి రియాక్ట్ అయ్యారు. త్రివిక్రమ్ కి తనకి మధ్య గొడవలు ఉన్నాయి అని అడిగితే హరీష్ శంకర్ దాని గురించి క్లారిటీ ఇచ్చారు.
Harish Shankar: "నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి రాకముందే.. త్రివిక్రమ్ గారికి ఐదో ఆరో అవార్డులు వచ్చాయి ఓన్లీ డైలాగ్లకే. నాకు ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, మాయాబజార్ సినిమా డైలాగులు, ఇవివి సత్యనారాయణ సినిమాల్లో డైలాగులు.. ఇలా డైలాగ్స్ అంటే నాకు ఒక సపరేట్ ఇష్టం ఉంది. అలాగే త్రివిక్రమ్ గారి డైలాగ్ లు అన్నా ఇష్టం. నేను ఇండస్ట్రీలోకి వచ్చే ముందుగా ఆయనకి మూడు నంది అవార్డులు కూడా వచ్చాయి. నాకంటే పెద్ద సీనియర్ ఆయన. ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన అతడు సినిమా ఒక్క కొన్ని వందలసార్లు చూసి ఉంటారు. ఒకరకంగా త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద అబ్బాయి. అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంటి ఇలా అన్నట్టు.. నా సినిమాల్లో ఏమైనా యాక్షన్స్ సీన్స్, కమర్షియల్ పంచ్ డైలాగ్ లు ఉంటే త్రివిక్రమ్ సినిమాలు చూడరా అని అని అనేవారు." అని త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.
"మా నాన్న కి త్రివిక్రమ్ మీద ఉన్న ఇష్టం నాకు ఎంత కోపం తెప్పించింది అంటే.. ఒకరోజు త్రివిక్రమ్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి నా సినిమాలు అన్నీ చూపించి, నేనంటే ఇష్టం అని చెప్పండి. మా ఇంట్లో త్రివిక్రమ్ గారు పెద్ద కొడుకు.. నేను మీ ఇంట్లో చిన్న కొడుకు అవ్వాలి అనుకుంటున్నాను అని చెబుదామని అనుకున్నాను" అని అన్నారు హరీష్ శంకర్.
"త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా గౌరవం. సోషల్ మీడియాలో పుకార్లు చూసి నవ్వుకోవాలి అంతే. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఒక రైటర్ గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం" అని అన్నారు హరీష్ శంకర్. త్రివిక్రమ్ గురించి హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి