Kolkata doctor murder case Mother in law of Accused Sanjay roy fires on incident: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో రోజుకో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆగస్టు 9 ట్రైనీ డాక్టర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ఆత్మహత్యగా ప్రచారం చేశారు. యువతికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. అంతేకాకుండా.. ఘటన జరిగిన ప్రదేశంలో నిందితుడి ఉపయోగించే బ్లూటూత్ దొరకడంతో.. సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
#WATCH | RG Kar Medical College & Hospital rape-murder case | Mother-in-law of accused Sanjoy Roy says, "My relations with him were very tense...They were married for 2 years...His marriage to my daughter was his second marriage...Initially, everything was good for 6 months. When… pic.twitter.com/MjIy5dhgeo
— ANI (@ANI) August 19, 2024
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సీబీఐ అధికారులు దీనిపై విచారణ చేస్తున్నాయి. మరోవైపు కోల్ కతా హైకోర్టు.. నిందితుడు సంజయ్ రాయ్ కు..పాలీ గ్రాఫ్ టెస్ట్, సైకో అనాలీసిస్, లేయర్డ్ వాయిస్ అనాలిసిస్ టెస్టులకు అనుమతి ఇచ్చింది. ఈనేథ్యంలో నిందితుడు అత్త.. సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు బైటపెట్టింది.
పూర్తి వివరాలు..
సంజయ్ రాయ్ రెండో భార్య అత్త దుర్గాదేవీ మీడియాతో మాట్లాడుతూ.. తన అల్లుడి మీద ఫైర్ అయ్యరు. తన కూతురు పట్ల దారుణంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అతడికి అప్పటికే మొదటి పెళ్లి జరిగి డైవర్స్ అయ్యింది. ఆ తర్వాత దుర్గాదేవీ కూతురుతో రెండో పెళ్లి జరిగింది. అయితే.. పెళ్లైన ఆరునెలలు బాగానే కాపురం సాగింది. ఆ తర్వాత అతగాడి నిజస్వరూపం బైటపెట్టాడు. అంతేకాకుండు.. ప్రతిరోజు తన కూతురికి వేధించేవాడని బాధపడింది. తన కూతురు మూడు నెలల ప్రెగ్నెంట్ ఉండగా.. ఇష్టమున్నట్లు కొట్టి, గాయపర్చాడని చెప్పింది.
అతని దెబ్బలకు తన కూతురుకు గర్భస్రావం అయ్యిందని చెప్పుకొచ్చింది. నిందితుడి మూడో భార్య ఇటీవల కొన్ని రోజుల క్రితం క్యాన్సర్ తో చనిపోయిందని చెప్పింది. నిందితుడు సంజయ్ రాయ్ ను కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనను సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడని అనుకోవట్లేదని.. దీని వెనుకాల మరికొందరు కూడా ఉండోచ్చని కూడా సంజయ్ అత్త చెప్పింది.
ఇలాంటి తప్పులు చేసిన వారికి కఠినంగానే పనిష్మెంట్ ఇవ్వాలని, ఉరితీయాలని కూడా ఫైర్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ ఘటనను ఈరోజు (మంగళవారం) సుప్రీంకోర్టు విచారించింది. కోల్ కతా ప్రభుత్వం, పోలీసులు, ఆర్ జీ కర్ ఆస్పత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. జూనియర్ డాక్టర్ చనిపోయిన దగ్గర నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామలను పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని కూడా సుప్రీం ధర్మాసం తెల్చిచెప్పింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి