Mrunal Thakur: బాలీవుడ్ కన్నా..తెలుగు సినిమాలే సూపర్ అంటున్న హీరోయిన్.. కారణం అదేనా!
Mrunal Thakur:సీతారామం సినిమాలో సీత పాత్రతో టాలీవుడ్ లో పాదం మోపిన మృణాల్ ప్రేక్షకుల మనసులో పర్మినెంట్ గా సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లో సినిమాలు ఆమెకు ఇవ్వలేని క్రేజ్ ను తెలుగులో ఒకే ఒక సినిమా అందించింది. రీసెంట్గా ఈ బ్యూటీ బాలీవుడ్ మేకర్స్ నుంచి బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Mrunal Thakur Next Film: మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో సీత గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఈ మధ్యకాలంలో ఇంతగా మెస్మరైజ్ చేసిన హీరోయిన్ మరొకరు లేరు అనడంలో ఆశ్చర్యం లేదు. సీతారామం చిత్రంలో మృణాల్ చేసిన పాత్ర ఏళ్ల తరబడి ప్రేక్షకుల మనసులో అలా గుర్తుండిపోతుంది. హృదయానికి అంతగా హత్తుకునే విధంగా ఆమె అభినయం ఉండడమే దీనికి కారణం. ఆ పాత్రకు ఆమె ఎంతగా కనెక్ట్ అయిందంటే.. నెక్స్ట్ చేసే మూవీస్ పై కూడా ఆ ఇంపాక్ట్ తగ్గకుండా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటుంది.
రీసెంట్ గా ఆమె నటించిన హాయ్ నాన్న మూవీ లో మృణాల్ మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ అందరినీ కట్టిపడేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో త్వరలోనే ఆమె తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. పాత్రలు ఎంచుకునే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మృణాల్ తెలుగు ఇండస్ట్రీకి బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ తన కెరీర్ ఆరంభ దశలో బాలీవుడ్ లో ఎదుర్కొన్న కొన్ని సిట్యుయేషన్స్ గురించి వెల్లడించింది.మృణాల్ హిందీ సీరియల్స్ లో కూడా నటించింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ని బాలీవుడ్ తో పోల్చి మరి బాగా ఎలివేట్ చేసింది మృణాల్. తన కెరీర్లో మంచి పాత్రలు సౌత్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి అని తేల్చి చెప్పిన మృణాల్.. బాలీవుడ్ లో అలాంటి పాత్రలు దొరకడం లేదు అని పేర్కొంది. చెప్పడం కేవలం సౌత్ అని చెప్పింది కానీ. ఆమె వరుసగా చేస్తున్న సినిమాలు టాలీవుడ్ నుంచే కాబట్టి..ఆమె ఎలివేట్ చేసింది టాలీవుడ్ ని అనడంలో డౌట్ లేదు.
అలాగే బాలీవుడ్ లో తను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు ఆమె చెప్పడం గమనార్హం. అయితే ఆమెను మొదట్లో కొందరు పల్లెటూరు పిల్లవి అన్నారట.. అంతేకాదు గ్లామర్ పాత్రలకు సరిపోవని తీసి పడేసారట. అలా ఆమె బాలీవుడ్ లో బాడీ షేమింగ్ కి గురి అయ్యాను అని చెప్పుకొచ్చింది. మొదట్లో రిజెక్షన్ కు గురి అయిన మృణాల్.. ఎంతో కష్టపడి తనను తాను రుజువు చేసుకుంది. ఒకప్పుడు అవమానించిన వారి ఇప్పుడు పిలిచి మరి ఆఫర్లు ఇచ్చే స్థాయికి ఎదిగింది.
Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్.. ఈ కథ స్ఫూర్తిదాయకం
Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook