Nawab First Look Poster: ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నవాబ్'. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఎమ్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రా అండ్ రస్టిక్ లుక్‌తో మాస్సివ్ ఇంపాక్ట్ క్రియేట్‌ చేసేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. పోస్టర్‌లో డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో.. ఇంటెన్సివ్‌గా సిగర్ తాగుతున్న హీరో పోస్టర్ ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్‌ యంప్ యార్డ్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ స్టోరీని డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్‌కు సరికొత్త ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం తెలిపింది. యాక్షన్ డ్రామా సీక్వెన్సెస్ ఆకట్టుకుంటాయని.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని వెల్లడించింది. చిత్రీకరణ వేగంగా జరుగుతోందని.. త్వరలోనే కంప్లీట్ కానుందని మేకర్స్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని.. సాధ్యమైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకుచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. 


నల్లమల మూవీకి దర్శకత్వం వహించిన రవి చరణ్‌కు నవాబ్ మూవీ రెండో చిత్రం. ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ కొరియోగ్రఫర్‌గా పనిచేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. మురళి శర్మ, దేవిప్రసాద్, శివపుత్రుడు రామరాజు, రాహుల్ దేవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పీఆర్, సినిమాటోగ్రఫర్‌గా రమేష్ కేఆర్, ఎడిటర్‌గా శివ సర్వని పని చేస్తున్నారు.


ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం


ఇది కూడా చదవండి : Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..