Mysskin About Leo Kashmir Schedule లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఇప్పుడు సౌత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా వచ్చే సినిమాలపై ఫుల్ బజ్ ఏర్పడి ఉంది. మాస్టార్ సినిమా తరువాత విజయ్ లోకేష్ కాంబోలో రాబోతోన్న సినిమా కావడంతో మరింతగా హైప్ ఏర్పడింది. తాజాగా కాశ్మీర్‌ షెడ్యూల్‌ నుంచి మిస్కిన్ వచ్చాడట. అక్కడ జరిగిన విషయాలు, ఆసక్తికరమైన ఘటనల గురించి చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు కాశ్మీర్ నుంచి చెన్నైకి వచ్చాను. ఐదు వందల మందితో కాశ్మీర్‌లో షెడ్యూల్ చేశాం. లియో కోసం పన్నెండు మైనస్ డిగ్రీల చలిలో పని చేశాం. స్టంట్ మాస్టర్ అన్బరివ్‌లు అద్భతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారు.. వారు నాపై ప్రేమను కురిపించారు. అసిస్టెంట్ డైరెక్టర్లు నాకు ఎంతో సహకరించారు. ఈ సినిమా నిర్మాత లలిత్ అయితే సెట్‌లో మాతో పాటు ఉన్నారు. మాతో పాటు సాధారణ వ్యక్తిలా పని చేశారు.


మా డైరెక్టర్‌ లోకేష్ కనకరాజ్‌ ఎంతో అద్భతమైన టాలెంట్ ఉన్నవాడు. లాస్ట్ షాట్ తరువాత నాకు హగ్ ఇచ్చాడు.. నేను అతని నుదురు మీద ముద్దు పెట్టాను.. నా కో స్టార్, నా బ్రదర్ విజయ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ టీం నా మీద చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మరిచిపోను. లియో పెద్ద హిట్ అవ్వబోతోంది అని చెప్పుకొచ్చాడు మిస్కిన్.


 



అసలే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సినిమాలపై అందరి దృష్టి పడింది. ఖైదీ సినిమాతో ఆశ్చర్యపరిచిన లోకేష్‌.. విక్రమ్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. నార్త్ ఆడియెన్స్ సైతం విక్రమ్‌ను చూసి షాక్ అయ్యారు. దీంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ మీద అందరిలోనూ హైప్ ఏర్పడింది. ఇప్పుడు అందరి ఫోకస్ విజయ్ లియో మీదే ఉంది. ఇప్పటికే సినిమా బిజినెస్ వివరాలు చూసి అంతా షాక్ అవుతున్నారు. నాలుగు వందల కోట్లకు ఆల్రెడీ సినిమా బిజినెస్ జరిగిందనే రూమర్ కూడా వైరల్ అవుతోంది. విజయ్ వారసుడు మూడు వందల కోట్లకు పైగా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook