Nani 28th film official announcement: టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) 'టక్ జగదీష్' షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అంతకుముందు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘వీ’ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఈ చిత్రంలో నానితోపాటు సుధీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అయితే టక్ జగదీష్ సినిమా షూటింగ్‌పై ఉండగానే.. శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన 28వ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించ‌నుంది. అయితే ఈ చిత్ర టైటిల్‌ని న‌వంబ‌ర్ 21న అనౌన్స్ చేయ‌నున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపింది. Also read: Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం నాని టక్ జగదీష్ (Tuck Jagadish), శ్యామ్ సింగరాయ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల షూటింగ్ పూర్తైన త‌ర్వాత  మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను మొదలుపెట్టనుంది. అయితే ఈ సినిమాకు బ్రోచోవారేవురురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. చిత్రంలో క‌థానాయిక‌గా మ‌ల‌యాళ బ్యూటీ న‌జ్రియా ఫ‌హ‌ద్ న‌టించ‌నున్న‌ట్టు మూవీ మేకర్స్ తెలిపారు. మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో.. అంటే నవంబరు 21న ప్ర‌క‌టించ‌నున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe