Prabhas Siddharth Anand ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న, చేయబోతోన్న సినిమాల లిస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా చెక్కుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఆదిపురుష్‌ వస్తుంది. ఇక ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఈ ఏడాది వచ్చే చాన్సులు ఉన్నాయి. ఈ రెండు సినిమాలే కాకుండా సలార్ కూడా లైన్లో ఉంది. ఈ సినిమా కూడా ఇదే సంవత్సరం వస్తుంది. ఇదే కాకుండా మారుతి దర్శకత్వంలో మరో సినిమా కూడా రెడీ అవుతోంది. అయితే ఇవన్నీ పూర్తయిన తరువాత స్పిరిట్ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతోన్న స్పిరిట్ సినిమా కాప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. పోలీస్‌గా ప్రభాస్ ఇందులో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమా పక్కన పెడితే.. ఇప్పుడు ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ మీద అప్డేట్ వచ్చింది. ప్రభాస్‌తో సినిమా తీయాలని మైత్రీ మూవీస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.


 




ఇప్పటికీ ప్రభాస్‌కు సరిపడ కథ, దర్శకుడు దొరికినట్టున్నాడు. వార్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు సిద్దార్థ్ ఆనంద్. ఇప్పుడు షారుఖ్ ఖాన్‌తో పఠాన్ అనే సినిమా తీశాడు. జనవరి 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు సిద్దార్థ్ ఆనంద్ మన ప్రభాస్‌తో సినిమా తీయబోతోన్నాడట. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోందట.


ఈ మేరకు మైత్రీ మూవీస్ అసలు విషయాన్ని చెప్పారు. వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ షోకు మైత్రీ నిర్మాతలు వచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ సినిమా ఉంటుందని కన్ఫామ్ చేశారు. త్వరలోనే అధికారికప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి వార్ సినిమాను మించే యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా ఉండేలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook